Mahua oil diya: ఇంట్లో మహువా నూనెతో దీపం వెలిగించండి.. మీరు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి
Mahua oil diya: మహువా నూనె దీపం ఎందుకు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించేందుకు ఉత్తమ సమయం ఏది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Mahua oil diya: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తారు. శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. నీటితో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించిన చాలు పరమ శివుడు ప్రసన్నుడు అవుతాడు.
శివుడి అనుగ్రహం పొందటం కోసం సోమవారం ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది. సనాతన ధర్మంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం పూజ చేసేటప్పుడు ఇంట్లో దీపం వెలిగిస్తారు. నెయ్యి, నూనె, ఆవ నూనెతో పాటు మొదలైన ఎన్నో వాటితో దీపం వెలిగిస్తారు. అయితే సోమవారం నాడు మహువా(ఇప్ప పూల) నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మహువా నూనెతో దీపం వెలిగించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ నూనెతో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
శివయ్య అనుగ్రహం
మహువా నూనెతో దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పరమ శివుడికి ఇది ఎంతో ప్రీతికరమైనదని నమ్ముతారు. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు. ఈ నూనెతో ఎనిమిది దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే ఆరోగ్యం ఉంటారు. దీర్ఘకాలంగా బాధిస్తున్న వ్యాధులు కూడా నయం అవుతాయని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడి ఆశీస్సులతో అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి.
నెగటివ్ ఎనర్జీ తొలగిపోయేందుకు
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇల్లు ప్రశాంతతకు కరవు అవుతుంది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక వాదనలు, ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. దీని నుంచి బయట పడేందుకు మహువా నూనెతో దీపం వెలిగించాలి. ఇంట్లో నెలకొన్న అశాంతి తొలగిపోయి సుఖ సంతోషాలు నిలుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని అలజడి, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది.
కోరికలు నెరవేరతాయి
మహువా నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. శివుడి అనుగ్రహంతో పాటు దేవతల అందరి అనుగ్రహం పొందగలుగుతారు. అయితే ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేక సమయం ఉంది. మహువా నూనె దీపాలను ఉదయం వేళ కాకుండా సాయంత్రం పూట వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు నెరవేరడంతో ప్రశాంతంగా ఉంటారు.
దోష నివారణకు
మహువా నూనెతో దీపం వెలిగించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. కుండలి దోషం, గ్రహ లోపాలు పరిష్కారం అవుతాయి. సూర్యదేవుడికి మహువా నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది. వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దీపం పెట్టేందుకు నియమాలు ఉన్నాయి. దీపాన్ని ఎప్పుడూ భూమిపై పెట్టకూడదు. దీపం పెట్టాలంటే కింద బియ్యం లేదా ఏదైనా వస్త్రం పరిచి పెట్టాలి. నేల మీద మాత్రం పెట్టకూడదు. దీపం సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దీపం కొండెక్కకముందే మీరు నోటితో ఊదకూడదు.
టాపిక్