తెలుగు న్యూస్ / ఫోటో /
Vastu Tips: ఇంట్లో కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల వాస్తు పరంగా ఎన్నో ప్రయోజనాలు
- Vastu Tips: కర్పూరం, లవంగాలను నిత్యం పూజల్లో ఉపయోగిస్తుంటారు. వాస్తు పరంగా వాటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
- Vastu Tips: కర్పూరం, లవంగాలను నిత్యం పూజల్లో ఉపయోగిస్తుంటారు. వాస్తు పరంగా వాటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
(1 / 7)
వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో సంతోషం తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచడానికి, నరదిష్టిని వదిలించుకోవడానికి, ఉద్యోగం పొందడానికి ఇంట్లో చినక్న చిన్న పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. వాస్తు ప్రకారం కర్పూరం, లవంగాలను కాల్చడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు.
(2 / 7)
కర్పూరం, లవంగాలను నిత్యం పూజలో ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఇంట్లో కాల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
(3 / 7)
ఆర్ధిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరం కాల్చడం వల్ల ధన కొరతను అధిగమించవచ్చు.
(4 / 7)
కర్పూరం, లవంగాలు, యాలకులు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి బాగా పనిచేస్తాయి. ఇవి దుష్ట శక్తులను ఇంటి నుంచి దూరంగా ఉంచుతాయి. ఒక పాత్రలో కర్పూరం, ఐదు యాలకులు, ఐదు లవంగాలు తీసుకుని కాల్చాలి. ముందుగా పూజగదిలో కాల్చి ఆ పొగను ఇంట్లోని ప్రతి మూలకు వ్యాపింపజేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడి నరదిష్టి తొలగిపోతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
(5 / 7)
శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు, కర్పూరం కాల్చడం వల్ల కుటుంబ సభ్యులకు ఆనందం, ప్రేమ కలుగుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. లవంగాలు, కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి.
(6 / 7)
కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా మీ వ్యాపారంలో విజయం సాధించలేరు. అలాంటి సందర్భాల్లో కర్పూరంతో ఈ రెమెడీని ప్రయత్నించండి. జాబ్ ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు కర్పూరం, లవంగాలు కాల్చడం మంచిది. మరో రెండు లవంగాలను నోట్లో వేసుకుని బయటకు వెళ్లండి. ఇంటర్వ్యూకు వెళ్ళే ముందు వాటిని కదిలించండి. ఇలా చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆవనూనెలో రెండు లవంగాలు వేయండి. ఉదయాన్నే దేవుని దగ్గర దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరైతే అంతా మంచే జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
(7 / 7)
వైవాహిక బంధంలో ఏదైనా సమస్య ఉంటే వెండి లేదా మరేదైనా పాత్రలో కర్పూరాన్ని వెలిగించండి. రెండు కర్పూరాలను వెలిగించి గది మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అలాగే రాత్రిపూట కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆరు కర్పూరం, 36 లవంగాలను ఇంట్లో చల్లుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.
ఇతర గ్యాలరీలు