Copper water bottle: రాగి పాత్రల్లో నీళ్లు తాగితే మంచిదే, కానీ వీరు మాత్రం తాగకూడదు
Copper water bottle: రాగి పాత్రలోని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అయితే ఇది అందరికీ వర్తించదు. రాగి పాత్రలో నీళ్లు తాగకూడని వ్యక్తులు కూడా ఉన్నారు.
ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే శతాబ్దాలుగా రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని ప్రజలు తాగేందుకు ఇష్టపడతారు. ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల పొట్ట సమస్యలు తొలగిపోయి శరీరంలో వాతం, పిత్తం, కఫం దోషాల సమతుల్యత ఏర్పడుతుంది. రాగి అనేది మీ శరీరం ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడే లోహం. ఇది నాడీ కణాలు, మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని ద్వారా కొల్లాజెన్, ఎముకలు, కణజాలాలను తయారవడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొంతమందికి మాత్రం ఆ నీళ్లు హాని చేస్తాయి. రాగి పాత్రలో నీరు తాగడానికి సరైన సమయం ఏమిటో, రాగి పాత్రలో నీటిని ఎవరు తాగకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
రాగి ఛార్జ్‌డ్ నీరు
రాగి పాత్రలో లేదా వాటర్ బాటిల్ లో నీటిని నింపి ఎనిమిది గంటల పాటు ఉంచి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ప్రక్రియను ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. దీని వల్ల రాగి లక్షణాలు నీటిలో కలిసిపోతాయి. ఈ నీటిని కాపర్ వాటర్ లేదా కాపర్ ఛార్జ్‌డ్ వాటర్ అంటారు. రాగి నీటిలో ఉండే అనేక రకాల బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా నీటిని శుద్ధి చేస్తుంది. అయితే పన్నెండు గంటలకు మించి నిల్వ ఉంచిన రాగి నీటిని మాత్రం తాగకపోవడమే మంచిది.
రాగి విషపూరితం
మీరు రోజంతా రాగి సీసా లేదా పాత్రలో ఉంచిన నీటిని తాగుతూ ఉంటే, మీ శరీరంలో రాగి విషపూరితంగా మారిపోతుంది. శరీరంలో రాగి పరిమాణం పెరగడం వల్ల కాలేయం, మూత్రపిండాల వైఫల్యంతో పాటు తీవ్రమైన వికారం, మైకము, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
విల్సన్ వ్యాధి
శరీరంలో రాగి అధికంగా ఉండటం వల్ల, విల్సన్ వ్యాధి ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యలో కళ్లు, కాలేయం, మెదడుతో పాటు శరీరంలోని అనేక భాగాల్లో రాగి పేరుకుపోతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రాగి పాత్రలను ఉపయోగిస్తే, పరిస్థితి తీవ్రంగా మారుతుంది.
అసిడిటీ
రాగి పాత్రలో నీటిని గంటల తరబడి నిల్వ ఉంచడం వల్ల వేడి అవుతుంది. దీని వల్ల వ్యక్తి ఎసిడిటీ సమస్య బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఇప్పటికే ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటే, రాగి పాత్రలోని నీటిని తాగకపోవడమే మంచిది.
కిడ్నీ పేషెంట్
కాపర్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ పేషెంట్ ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుంది. పాదాలు ఉబ్బినా లేదా డయాలసిస్ చేయించుకుంటున్నా కిడ్నీ రోగులకు రాగి నీరు ఎంతో హానికరంగా మారుతాయి.
గుండెకు సంబంధించిన సమస్యలు
రాగి నీరు గుండె రోగులందరికీ మంచిది కాదు. ఊపిరి ఆడని రోగులు, కొద్దిదూరం నడిచిన తర్వాత శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న రోగులు రాగి నీళ్లు తాగకూడదు. అలాంటి వారు రాగి పాత్ర నీరు తాగే ముందు వైద్యులను సంప్రదించాలి.
రాగి నీరు త్రాగడానికి సరైన సమయం ఏది?
ఉదయాన్నే పరడుపున ఖాళీ పొట్టతో రాగి నీరు త్రాగడానికి సరైన సమయం. అలా తాగడం వల్ల ఎక్కువ ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు.
టాపిక్