తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం వారఫలాలు- ఈ రాశుల వారికి రుణ బాధలు తొలగుతాయి, ఉద్యోగంలో ఉన్నత పదవులు

ఈ వారం వారఫలాలు- ఈ రాశుల వారికి రుణ బాధలు తొలగుతాయి, ఉద్యోగంలో ఉన్నత పదవులు

HT Telugu Desk HT Telugu

15 September 2024, 2:00 IST

google News
  • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

సెప్టెంబర్ 15 నుంచి 21 వ తేదీ వార ఫలాలు
సెప్టెంబర్ 15 నుంచి 21 వ తేదీ వార ఫలాలు

సెప్టెంబర్ 15 నుంచి 21 వ తేదీ వార ఫలాలు

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 15-09-2024 నుంచి 21-09-2024 వ‌ర‌కు

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

మాసం: భాద్రప‌ద‌ , సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

కొత్త విషయాలు తెలిసి సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. అనూహ్యంగా ఆశించిన ఆదాయం సమకూరుతుంది. బాధలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో ఏర్పడిన వివాదాలు తీరతాయి. శుభకార్యాపై శ్రద్ధ వహిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొంత నలత చేసి చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండొచ్చు. మహిళలు ఆనందకరంగా గడుపుతారు. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

వృషభం

వారఫలాల ప్రకారం ఈ వారం వృషభ రాశి వాళ్ళు గత సంఘటనలు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, స్థలాలు సమకూర్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలోని అందరితో సఖ్యత నెలకొంటుంది. వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఆశించిన లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హెూదాలు పొందుతారు. విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళలు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం

కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు.. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. ఉద్యోగ యత్నాలలో కొంత నిరాశ తప్పదు. కాంట్రాక్టులు దక్కినట్లే అనిపించి నిరుత్సాహపరుస్తాయి. అనుకున్న ఆదాయం కనిపించక రుణాలు చేస్తారు. ఖర్చుల విషయంలో నిదానం పాటించండి. కుటుంబసభ్యులే కొన్ని నెపాలు మోపే వీలుంది. మీ ఓపికకు పరీక్షా సమయమనే చెప్పాలి. సోదరులతో ఆకారణంగా విభేదాలు ఏర్ప‌డ‌వ‌చ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీద పడి ఉక్కిరిబిక్కిరి అవుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. దుర్గామాతను పూజించండి.

కర్కాటకం

శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలోని సమస్యలు నేర్పుగా పరిష్కరిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడిస్తారు. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు, వ్యాపారాలలో లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

సింహం

కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మీ నైపుణ్యం, పట్టుదలను మిత్రులు ప్రశంసిస్తారు. ఎంతటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సంతోషదాయకంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య స‌మ‌స్యలు ఉండొచ్చు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. కళాకారులు, రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం ల‌భిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది.

కన్య

ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఖ్యాతి పెరుగుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు జాప్యం లేకుండా అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు నిర్వహిస్తారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొంత నలత చేసి తక్షణం ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులు కొన్ని మార్పులకు సిద్ధపడాలి. అయితే సహచర ఉద్యోగులు మీకు సహకరిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు కొంతమేర తగ్గుతాయి. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

తుల

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఒక మర్చిపోలేని సంఘటన ఎదురవుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు పెరిగే అవకాశం. సోదరులతో విభేదాలు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. భాగస్వాములు పెట్టుబడులు సమకూర్చుతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీయానం. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. శివాష్టకం పఠించండి.

వృశ్చికం

సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. పూర్వపు సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొంత సొమ్ము అందుకుంటారు. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆస్పత్రులు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పోస్టులు దక్కవచ్చు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు నూతనోత్సాహం ల‌భిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించండి.

ధనుస్సు

భూ, గృహయోగాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలోని అందరితోనూ సఖ్యంగా మెలగుతారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం చికాకు పరుస్తుంది. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అంది ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మకరం

వార ఫలాల ప్రకారం ఈ వారం మకర రాశి వారికి కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆకస్మిక ధనలబ్ధితో ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కుదుటపడుతుంది. శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అంది విస్తరిస్తారు. లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం

కొన్ని సమస్యల పరిష్కారంలో మీ కృషి ఫలిస్తుంది. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి పెరిగి గౌరవం పొందుతారు. భార్యాభర్తలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సొమ్ములకు లోటు లేకుండా గడుపుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. మీ నైపుణ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. బంధువర్గం నుండి కీలక సమాచారం రావచ్చు. అనారోగ్యం నుండి స్వస్థత చేకూరి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొత్త భాగస్వాములను కలుపుకుంటారు. ఉద్యోగులకు విధులలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఆంజనేయ స్వామిని పూజించండి.

మీనం

పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. బాకీలు చాలావరకూ అందుతాయి. అవసరాలకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. సోదరులు, బంధువుల సహాయసహకారాలు పరిపూర్ణంగా అందుతాయి. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములు కొత్త పెట్టుబడులు అందిస్తారు. లాభాలు మరింత దక్కుతాయి. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం