సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసా? ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు మీకోసం.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారము చంద్ర, గురు, శుక్రులు శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలుగా రవి, బుధులు మధ్యస్థ ఫలితాలు ఇచ్చే గ్రహాలుగా, శని, కుజ, రాహు, కేతువులు క్రూర, పాప గ్రహాలుగా చెప్పబడిందని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ క్రూర మరియు పాప గ్రహాలలో ఉన్నటువంటి కుజ మరియు రాహు గ్రహాల బాధల నుంచి లేదా కర్మ ఫలితాల నుంచి రక్షణ పొందడానికి ఆరాధించవలసిన దైవమే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చిలకమర్తి తెలిపారు.
జాతక దోషాలు తొలిగేందుకు
జాతకంలో కుజ దోషము, కాలసర్బ దోషము, రాహు, కేతు దోషాలు ఉన్నటువంటి వారికి కుజ మహర్దశ, రాహు మహర్దశ వంటి దశలు జరిగేటటువంటి వారికి సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు. వివాహం ఆలస్యం అయ్యేటటువంటి వారికి, వివాహ విషయంలో సమస్యలు ఉన్నటువంటి వారికి, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారికి, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహములు ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్యుని పూజించడం వలన ఆ సమస్యలు తొలగుతాయని అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒకసారి జగద్దురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్ళారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు. ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు. మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి. అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్బ దోషం ఒకటి. దీనికి కారణం.. మనం తప్పుచేయకపోవచ్చు. ఎక్కడో వంశంలో తప్పు జరిగినా మనకు తగులుతుంది. సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే, స్పర్శిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది.
దోష ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది. చివరిలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉన్నది. వీలుంటే ఒకసారి భక్తితో పఠించండి.
ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్సాదులు స్వామిని మహాంబోధితీరే మహాపాపచోరే అని కీర్తించారు
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది. అలానే శరవణభవ అనే నామానికి ఉన్న ప్రాశస్య్యం ఏమిటో తెలుసుకుందాం.
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే శరవణభవ
ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
శ లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు. ర అగ్నిబీజము అధిదేవత అగ్ని. వ అమృతబీజము అధిదేవత బలభద్రుడు. ణ యక్షదబీజము అధిదేవత బలభ్రద్రుడు. భ అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి. వ అమృతబీజము అధిదేవత చంద్రుడు.
షడాననం చందన లేపితాంగం
మహారసం దివ్య మయూర వాహనం
రుదస్య నూనుం సురలోకనాథం
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే
శ శమింపజేయువాడు. ర రతిపుప్టిని ఇచ్చువాడు. వ వంధ్యత్వం రూపుమాపువాడు. ణ రణమున జయాన్నిచ్చేవాడు. భ భవసాగరాన్ని దాటించేవాడు. వ వందనీయుడు అని శరవణభవికు గూఢార్థం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్