Success vastu tips: శత్రు, రుణ బాధలు తొలగిపోయేందుకు ఇలా చేయండి- మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి
Success vastu tips: ప్రతి ఒక్కరూ కష్టతరమైన జీవితంలో ప్రశాంతమైన క్షణాలను గడపాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల జీవితంలో అశాంతి, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వాస్తు ప్రకారం ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకున్న దోషాలు, రుణ బాధలు తొలగిపోతాయి.
Success vastu tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా వైఫల్యాలను ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడానికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. జీవితంలో శుభకరమైన, ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి ఏ వాస్తు చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి.
నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు
ఇంట్లో చిన్న ఇండోర్ మొక్కలను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి వాటిని పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా ఉంటుంది.
అతిథి దేవో భవ అంటారు పెద్దలు. మీ ఇంటికి వచ్చే వ్యక్తిని గౌరవించాలి. వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెప్తారు. వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి.
రుణ, శత్రు బాధలు తొలగించుకునేందుకు
ఇది కాకుండా జంతువులు, పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మూగజీవాలకు ఆహారం పెట్టి వాటి ఆకలి తీర్చడం అనేది చాలా పుణ్యం సంపాదిస్తుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. కాకికి తినిపిస్తే పిత్ర దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల శత్రువులను దూరం చేస్తుంది. కేతువు కూడా ప్రశాంతంగా ఉంటాడు. చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల రుణాన్ని తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు గ్రహ బాధలు కూడా తగ్గుతాయి.
మీరు మీ రంగంలో విజయం సాధించాలనుకుంటే మీ ఇంటికి తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచండి. అంతే కాకుండా చేపలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. కుంకుమ, బెల్లం కలిపిన నీటితో ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ సమయంలో ఓం సూర్య దేవాయ నమః అని జపించాలి. స్త్రీలు సాయంత్రం ఇంటి గుమ్మంలో దీపం వెలిగించాలి. మీ తండ్రి, తండ్రి లాంటి పెద్దలను గౌరవించండి.
వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. డబ్బు నష్టం సంభవిస్తుంది. నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే చీపురును ఉత్తర, పడమర, వాయువ్య దిశలో ఉంచాలి. అలాగే ఎప్పుడూ నిలబెట్టకూడదు. పడుకోబెట్టి ఉంచాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్