Head Bath days: ఏ రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది
Head Bath days: పురుషులు, స్త్రీలు ఎప్పుడు తల స్నానం చేయాలి? ఏ రోజు తల స్నానం చేస్తే మంచి జరుగుతుంది?
Head bath: పండుగల సమయాల్లో ఆచారాలు పాటిస్తూనే ఉంటారు. పండుగ పూట పొద్దున్నే తలంటు స్నానం చేస్తే మంచిది. కొంతమంది రోజూ తల స్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒక సారి చేస్తారు. చాలా మంది శుక్రవారం రోజు తల స్నానం చేసి పూజ చేసి దీపం పెడతారు. అయితే తలంటు స్నానానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా?
ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి వేళ నూనె పెట్టేసి తెల్లారి తలస్నానం చేసి ఆఫీసులకి వెళ్లిపోతున్నారు. కానీ వారంలో అన్ని రోజులు తలంటు స్నానం చేయడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు.
పురుషులు ఏయే రోజుల్లో తలంటు స్నానం చేయాలంటే?
సోమవారం తలంటు స్నానం చేయడం వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది. అందుకే ఈరోజు తల స్నానం చేసేందుకు ప్రయత్నించండి.
మంగళవారం రోజు తల స్నానం చేయకుండా మామూలు స్నానం చేయడం మంచిది. బుధవారం తల స్నానం చేస్తే మీకు లక్ష్మీ దేవి దీవెనలు లభిస్తాయి. మీ సంపద పెరుగుతుంది. ఆదాయం పొందుతారు. మగవాళ్ళు గురువారం తలస్నానం చేయకపోవడం ఉత్తమం.
శుక్రవారం కూడా పురుషులు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. శనివారం రోజు పురుషులు తల స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది. ఆదివారం తలకి పోసుకుంటే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి. అందుకే పురుషులు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే మంచిది.
స్త్రీలు ఎప్పుడు తలంటుకోవాలి?
మహిళలు సోమవారం తల స్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు. బుధవారం తల స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత పెరుగుతుంది. శని వారం తలంటు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. సత్ఫలితాలు కలుగుతాయి. అయితే పండుగలు, శుభ కార్యాలు, వ్రతాలు, నెలసరి సమయంలో మాత్రం స్త్రీలకు ఏవి వర్తించవు. శుక్రవారం రోజు తలస్నానం చేస్తే దేవుడికి దీపం వెలిగించి ఒక పూట ఆహారం తీసుకోవడం మంచిది.
టాపిక్