ఉద్యోగస్తులు, వ్యాపారులు చేసేవాళ్లు నిత్యం ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. బయట ఎంత ఒత్తిడి ఉన్నా... ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని భావిస్తారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోస కొన్ని ఇండోర్ మొక్కలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. 

pexels

By Bandaru Satyaprasad
Feb 28, 2024

Hindustan Times
Telugu

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే 5 ఇండోర్ మొక్కలు గురించి తెలుసుకుందాం.    

pexels

ఇండోర్ మొక్కలు సహజ సౌందర్యంతో పాటు సానుకూల శక్తిని అందిస్తాయి. ఒత్తిడిని తగ్గించడం, గాలిని శుద్ధి చేయడానికి సాయపడతాయి. 

pexels

పీస్ లిల్లీ - అందమైన తెల్లని పువ్వులు, గాలిని శుభ్రపరిచే లక్షణాలున్న ఇండోర్ ప్లాంట్ ఇది. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, అమ్మోనియా వంటి హానికరమైన టాక్సిన్స్ నుంచి గాలిని శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉటుంది. ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. వీటిని బెడ్‌రూమ్‌లు లేదా మెడిటేషన్ రూమ్ లలో పెట్టుకుంటే మంచిది.  

pexels

స్నేక్ ప్లాంట్ - ఈ ప్లాంట్ ను అత్తగారి నాలుక(Mother-in-law Tongue) అని కూడా పిలుస్తారు. అసాధారణమైన గాలిని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది తక్కువ కాంతిలోనూ పెరుగుతుంది. ఇండోర్ గాలి నాణ్యతను పెంపొందించడంతో పాటు, ప్రతికూల ఎనర్జీని గ్రహిస్తుంది. ఇంటి ఎంట్రన్స్ డోర్ వద్ద ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలను దూరం చేసి, పాజిటివ్ ఎనర్జీని స్వాగతించవచ్చు. 

pexels

మనీ ప్లాంట్- అల్లిన ట్రంక్, పచ్చని ఆకులతో ఉంటే ఈ ప్లాంట్ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఫెంగ్ షుయ్ సూత్రాల ప్రకారం ఈ మొక్క మీ ఇంటికి సంపద, సానుకూల శక్తిని పెంచుతుంది. మనీ ట్రీ పెంచడం చాలా సులభం, తక్కువ కాంతిలోనే ఇది పెరుగుతుంది. ఇంటి ఆగ్నేయ ప్రాంతంతో దీనిని పెడితే సానుకూల ప్రభావాలు పెరుగుతాయని నమ్ముతారు. 

pexels

లావెండర్ - సువాసన వెదజల్లడంతో పాటు ప్రశాంతత లక్షణాలకు ఇది ప్రసిద్ధి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఇది అద్భుతమైన ఎంపిక. దీనిని ఆరుబయట కనిపించే కిటికీ దగ్గర ఎండ ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే ఇంట్లో సానుకూల వాతావరణం వృద్ధి చెందుతుంది. బెడ్‌రూమ్‌లు లేదా విశ్రాంతి ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు.   

pexels

అలోవెరా- కలబంద వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. అలోవెరా నెగిటివ్ ఎనర్జీని గ్రహించి, ప్రశాంతతను కలిగిస్తుంది. అలోవెరా పెంపకం చాలా సులభం, తక్కువ నీరు, కాంతిలో కూడా పెరుగుతుంది. వంటగది లేదా గదిలో ఉంచడం వల్ల ఒత్తిడిని తటస్తం చేస్తుంది. బిజీగా ఉన్న ప్రాంతాల్లో సానుకూల వైబ్‌లను ప్రోత్సహిస్తుంది. 

pexels

వేసవిలో చెమట వాసన సమస్యా...? ఇలా వదిలించుకోండి

image credit to unsplash