Broomstick vastu tips: చీపురు కాళ్లతో తొక్కకూడదని ఎందుకు అంటారు?
Broomstick vastu tips: హిందూ శాస్త్రంలో చీపురకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కొత్తగా ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త చీపురు వెంట తీసుకుని వెళతారు. అలా చేస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం.
Broomstick vastu tips: ప్రతి ఒక్కరూ చీపురుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కేవలం దుమ్ము, ధూళి శుభ్రం చేసేదానిగా చూడరు. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపం అంటారు. అందుకే చీపురు పెట్టె దిశ దగ్గర నుంచి ఎలాంటి చీపురు ఇంట్లో ఉండాలనే దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటారు.
చాలా మంది కాళ్లతో చీపురు తొక్కడం లేదంటే పక్కకి నెట్టేయడం చేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. చీపురు లక్ష్మీదేవి స్వరూపమని కాళ్ళకి తగలకూడదని ఇంట్లో వాళ్ళు చెప్తారు. కానీ ఇది ఒట్టి మూఢ నమ్మకమని చాలా మంది నమ్మకుండా ఉంటారు. వాస్తు శాస్త్రంలో కూడా చీపురుకి ప్రాధాన్యత ఉంటుంది. ఇల్లు ఊడ్చే చీపురు ఎలా పడితే అలా పడేయకూడదు అంటారు. అలా చేస్తే ఆర్థిక పరమైన సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.
చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు?
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. చీపురు కాళ్ళకి తగలడం వల్ల సంపదకి మూలమైన లక్ష్మీదేవిని అవమానించినట్టుగా భావిస్తారు. అది మాత్రమే కాదు చీపురు నిలబెట్టడం కూడా మంచిది కాదని అంటారు. దుమ్ము, ధూళి చీపురు కొనలకు అంటుకుని ఉంటుంది. చీపురు కొనలు, ముడి వేయని తలవెంట్రుకలు, అపరిశుభ్రమైన పాదాలు, మురికిగా ఉన్న గోళ్ళు శని దేవుడి నివాసం ఏర్పరుచుకునే స్థలాలుగా చెబుతారు. అందుకే చీపురు కొనలు కాళ్ళకి తగలడం వల్ల శని బాధలు కలుగుతాయని అంటారు. చీపురు కాళ్ళకి తగలడం వల్ల దానికి ఉన్న క్రిములు శరీరానికి అంటుకుని అనారోగ్య సమస్యలు వస్తాయని అంటారు.
చీపురు తొక్కడం కూడా చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉండవని అంటారు. ఇంట్లో చీపురు పెట్టె విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. చీపురు ఎవరి కంట పడకూడదు. అలాగే వంట గదిలో చీపురు పెట్టకూడదు. అలా చేస్తే ఆహార కొరత ఏర్పడుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే ఎటువంటి వస్తువులు కూడా వంట గదిలో ఉంచకూడదు. కిచెన్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
భారతీయులకే కాదు వీరికి నమ్మకమే
చీపురు కాళ్లతో తొక్కడం అరిష్టం అనే నమ్మకం భారతీయులకు మాత్రమే కాదు ఆఫ్రికా వారికి కూడా ఉందట. చీపురు కాళ్ళకి తగిలితే తమ ఇంట్లో వాళ్ళకి మరణం సంభవిస్తుందని లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలు పాలవుతారని నమ్ముతారు. దీనికి పరిహారంగా తగిలిన చీపురు మీద ఉమ్మి వేస్తారు. ఇలా చేస్తే తమకి ఎటువంటి అరిష్టం అంటుకోదని భావిస్తారు.
చీపురు ఇక్కడ పెడితే కష్టాలే
చీపురు ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలి. ఎవరికి కనిపించని ప్రదేశమని చెప్పి మంచం కింద పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి. ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది. మంచం కింద చీపురు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మీమీద ఉండదు. పాడైపోయిన, విరిగిపోయిన చీపురు ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు. శనివారం రోజు విరిగిపోయిన చీపురుని బయట వేయాలి. చీపురుని మంగళవారం, శనివారం, అమావాస్య రోజుల్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆలయానికి మూడు చీపుర్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇల్లు చిమ్మకూడదు. అలాగే అతిథులు రాకముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి.
టాపిక్