Broom Stick: చీపురు ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి?
Broom Stick: చీపురు ఏ దిశలో పెట్టాలో తెలుసా? వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి? ఏ దిక్కున పెడితే మంచిది.. ఇక్కడ తెలుసుకోండి.
చీపురు ఇల్లు శుభ్రపరచడానికి మాత్రమే కాదు దానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. చీపురు లక్ష్మీదేవితో సమానం అంటారు. అందుకే చాలా మంది ధనత్రయోదశి రోజున కొత్త చీపురు కొని పూజలు చేస్తారు.
ఇంట్లో చీపురు పెట్టేందుకు కూడా తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలి. అప్పుడే ఇంట్లో సంపద, శ్రేయస్సు, లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని అంటుంటారు. అది మాత్రమే కాదు చీపురు ఎప్పుడుపడితే అప్పుడు కొనకూడదు. అందుకు సరైన సమయం చూసుకోవాలని చెబుతారు. నియమాలు పాటించినప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం చేసుకోవచ్చు.
చీపురు ఎప్పుడు కొనాలంటే..
ఇంట్లోకి కొత్త చీపురు కొనేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటికి కొత్త చీపురు కొనడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆరోజు కొత్త చీపురు కొనడం వల్ల ఆనందం, శాంతి కలుగుతుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది. శనివారం కృష్ణ పక్షంలో మాత్రమే చీపురు కొనాలట. శుక్ల పక్షంలో ఎప్పుడు కొత్త చీపురు కొనకూడదు. అది దురదృష్టానికి సూచిక.
కళ్ళకు కనిపించేలా చీపురు పెట్టొద్దు
చీపురు అందరికీ కనిపించేలా బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదు. ఇంటి సంపదని దాచి ఉంచినట్టే చీపురు కూడా కనిపించకుండ పెట్టాలి. బహిరంగ ప్రదేశంలో పెట్టడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోతుంది.
చీపురు నిలబెట్టవద్దు
చాలా మంది ఇళ్ళలో చీపురు తలుపులు వెనుక నిలబెడతారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. చీపురు నిలబెట్టడం వల్ల ఇంటికి దారిద్య్రం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే చీపురు ఎప్పుడు నేలపై పడుకోబెట్టాలని సూచిస్తారు. అది మాత్రమే కాదు చీపురుని కాలితో పట్టుకోవడం, తొక్కడం వంటివి అసలు చేయకూడదు.
పాత చీపురు విసిరేస్తున్నారా?
కొత్త చీపురు కొన్న తర్వాత పాత చీపురు అరిగిపోయిందని చెత్త బుట్టలో పడేస్తుంటారు. ఎప్పుడంటే అప్పుడు పాత చీపురు బయట పడేయడం వల్ల ఇంటికి అరిష్టం అని చెబుతుంటారు. వాస్తు ప్రకారం గురువారం, శుక్రవారం ఇంటి నుంచి పాత చీపురు పొరపాటున కూడా పడేయద్దు. అరిగిపోయిన పాత చీపురుని అమావాస్య లేదా శనివారం మాత్రమే చేయాలి.
సాయంత్రం ఊడవకూడదు
సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇల్లు ఊడవకూడదు. లైట్లు వేసిన తర్వాత ఇల్లు చిమ్మడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. అలాగే చిమ్మిన తర్వాత వచ్చిన చెత్త, మట్టి డస్ట్ బిన్ లో వేసుకోవాలి బయటకి విసిరేస్తే ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని నమ్మకం. చీపురుని వంట గదిలో అసలు పెట్టకూడదు. అలా చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇంట్లోని వ్యక్తులు బయటకి వెళ్ళిన తర్వాత ఇల్లు అసలు చిమ్మకూడదని పెద్దలు చెబుతుంటారు.
చీపురు దానం చేయొచ్చా?
సాధారణంగా చీపురు దానం చేయకూడదని అంటారు. లక్ష్మీ దేవిని ఇతరులకి ఇచ్చినట్టు భావిస్తారు. కానీ శుక్రవారం రోజున గుడికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి మూడు చీపుర్లు దానం చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్