Lucky plants: ఈ లక్కీ మొక్కలు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు
Lucky plants: వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆ లక్కీ మొక్కలు ఏవంటే..
Lucky plants: సంపదకి మూలం లక్ష్మీదేవి. అమ్మవారి అనుగ్రహం కోసం అందరూ ఎదురుచూస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తే జీవితంలో దేనికి కొదువ ఉండదు. సుఖ సంతోషాలతో, డబ్బులతో ఆనందంగా ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిశని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈ దిశలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
వాస్తు ప్రకారం లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే కొన్ని పనులు చేస్తే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు మీరు ఇంట్లో కొన్ని మొక్కలు నాటుకోవాలి. వీటిని ఇంట్లో నాటడం వల్ల అదృష్టంతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. పేదరికం తొలగిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా హ్యాపీగా జీవితం సాగిస్తారు. ఇంటికి ఉత్తర దిశలో ఈ మొక్కలు నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది.
అరటి చెట్టు
వాస్తు శాస్త్రంలో అరటి చెట్టుకు చాలా ప్రాదాన్యత ఉంటుంది. అరటి చెట్టుని ఇంటి ఉత్తర దిశలో నాటితే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి గురువారం విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనుగ్రహం పొందుతారం అలాగే అరటి చెట్టు మీద ప్రతి గురువారం అరటి చెట్టు మీద నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.
తులసి
హిందూ ఆచారంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ తులసి కోటకి పూజ చేయడం చేస్తారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్కను ఉత్తర దిశలో నాటి పూజించడం వల్ల ధన వర్షం కురుస్తుంది. ఆటంకాల వల్ల ఆగిపోతూ వస్తున్న పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఉత్తర దిశలో తులసి మొక్క ఉండటం వల్ల తగినంత సూర్యరశ్మి కూడా తగులుతుంది.
వెదురు
వాస్తు ప్రకారం వెదురు మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు. ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం కూడా వెదురు లక్కీ ప్లాంట్ అంటారు. ఈ మొక్కని ఉత్తర దిశలో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ప్రతికూల శక్తులని దూరం చేస్తుంది.
మనీ ప్లాంట్
చాలా మంది ఇంటి ముందర కుండీల్లో మనీ ప్లాంట్ కనిపిస్తుంది. మనీ ప్లాంట్ ఉండటం వల్ల డబ్బుకు కొరత ఉండదని చెప్తారు. ఇది అదృష్టాన్ని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. ఇంటికి ఉత్తర దిశలో నీలం రంగు బాటిల్ లేదా పారదర్శకంగా ఉండే కుండీలో మనీ ప్లాంట్ నాటుకోవచ్చు. అయితే మనీ ప్లాంట్ ఎండిపోకుండా చూసుకోవాలి. అప్పుడే ఇంటికి శ్రేయస్కరం.