Goddess lakshmi devi blessings: ఈ ప్రత్యేక పరిహారాలతో లక్ష్మీదేవిని పూజిస్తే కొత్త సంవత్సరం మీకు ఏ లోటు ఉండదు-all zodiac signs should please goddess lakshmi devi with this special remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi Blessings: ఈ ప్రత్యేక పరిహారాలతో లక్ష్మీదేవిని పూజిస్తే కొత్త సంవత్సరం మీకు ఏ లోటు ఉండదు

Goddess lakshmi devi blessings: ఈ ప్రత్యేక పరిహారాలతో లక్ష్మీదేవిని పూజిస్తే కొత్త సంవత్సరం మీకు ఏ లోటు ఉండదు

Gunti Soundarya HT Telugu
Dec 28, 2023 11:30 AM IST

Goddess lakshmi devi blessings: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఇలా పూజించారంటే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. నూతన సంవత్సరం మీ జీవితం బాగుంటుంది.

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గం
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గం

Goddess lakshmi devi blessings: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరిసంపదలకి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సుల కోసం తాపత్రయపడతారు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రతీకరమైన రోజు. సంపదల దేవతగాలక్ష్మీదేవిని పిలుస్తారు. అమ్మవారు కరుణిస్తే సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయి.

శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన సమస్యలు దూరం అవుతాయి. మీ రాశి చక్రం ప్రకారం ప్రతి శుక్రవారం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఫలితం కలుగుతుందో తెలుసుకోండి.

మేష రాశి వాళ్ళు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు చునారీ, ఎరుపు రంగు గులాబీ పువ్వులని సమర్పించి పూజించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి.

వృషభ రాశి వాళ్ళు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.

మిథున రాశి వాళ్ళు శుక్రవారం లక్ష్మీదేవికి ఎరుపు రంగు చునారీ, ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిది.

కర్కాటక రాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 16 మేకప్ ఐటమ్స్ కూడా సమర్పించాలి. కొత్త ఏడాది కర్కాటక రాశి వారి మీడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఒంటరిగా జీవిస్తున్న వారి జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంది.

కొత్త ఏడాది సింహ రాశి వారి మీద లక్ష్మీ కటాక్షం ఉండనుంది. అమ్మవారి ఆశీస్సులతో 2024 లో సింహ రాశి జాతకులు ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు పొందటం కోసం సింహ రాశి వాళ్ళు శుక్రవారం లక్ష్మీ దేవికి డ్రై ఫ్రూట్స్ నైవేదంగా సమర్పించాలి. తులసి చాలీసా పఠించడం మంచిది.

కన్యారాశి ఉన్నవారు శుక్రవారం రోజు శ్రీలక్ష్మీ చాలీసా పఠించాలి.

తులా రాశి వాళ్ళు అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు సమర్పించి ఖీర్ నైవేద్యంగా పెట్టాలి.

వృశ్చిక రాశి కలిగిన జాతకులు ఎర్ర గులాబీలు, ఎర్ర గాజులు సమర్పించాలి.

ధనస్సు రాశి వాళ్ళు శుక్రవారం శ్రీ సూక్తం స్త్రోత్రం పఠించాలి. 2024 లో ధనస్సు రాశి వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త సంవత్సరం శుభ ప్రదంగా ఉంటుంది.

మకర రాశి వాళ్ళు లక్ష్మీదేవి ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించాలి.

కుంభ రాశి వాళ్ళు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కుంకుమతో సహా అలంకరణ వస్తువులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

మీన రాశి వాళ్ళు అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి. శుక్రవారం పూట ఈ పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

WhatsApp channel