Lord saturn: 2024 లో శని ఈ ఐదు రాశులపై చెడు కన్నేసి ఉంచుతాడు.. జాగ్రత్త
Lord saturn: కొత్త ఏడాది ఈ ఐదు రాశుల మీద చెడు ప్రభావాలు చూపుతాడు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే శని అనుగ్రహం లభిస్తుంది.
Lord saturn: న్యాయ దేవుడు శని అంటే అందరికీ భయమే. శని స్థానం శుభప్రదంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. శని దేవుని చల్లని చూపుతో ఆర్థిక పరంగా కూడా పుంజుకుంటారు. కర్మానుసారంగా ఫలితాలు ఇవ్వడం వల్ల ఆయనకి న్యాయదేవుడనిన్ పేరు వచ్చింది.
జ్యోతిష్యంలో శని స్థాన మార్పుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. శని అన్ని రాసుల్లో సంచరించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 2024 లో శని రాశి చక్రం మారకుండా కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా కొన్ని రాశుల మీద శని అదృష్టాన్ని ఇస్తే మరికొన్ని రాశులకి సమస్యలు ఇస్తాడు. ఈ ఏడాది శని రాశి మారకపోయినప్పటికీ తన దిశని మార్చుకుంటుంది. కొన్ని సందర్భాలలో తిరోగమనం కూడా చేస్తుంది. శని అనుగ్రహంతో కొన్ని రాశులకు అదృష్టం పడుతుంది. కానీ శని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
2024 లో శని సంచారం ఎప్పుడు మారుతుంది?
ఫిబ్రవరి 11 నుంచి మార్చి 18 వరకు శని దహనం ఉంటుంది.
మార్చి 18, 2024 న శని ఉదయిస్తాడు.
జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు శని తిరోగమన దిశలో ఉంటాడు.
శని సడే సతీ, దయ్యా ప్రభావం ఏ రాశుల మీద ఉంటుందంటే..
2024 సంవత్సరంలో శని దేవుని కన్ను ఈ ఐదు రాశుల మీద ఉంటుంది. శని దేవుని సడే సతీ ప్రభావం కుంభం, మీన రాశి, మకర రాశిపై ఉంటుంది. అదే సమయంలో కర్కాటక, వృశ్చిక రాశుల వారికి శని దేవుని దయ్యా వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. శని సడే సతీ, దయ్యా చెడు ప్రభావాల కారణంగా ఈ ఐదు రాశుల వారి జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సడే సతీ, దయ్య ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఒకసారి ఉంటుంది.
చెడు ప్రభావం తగ్గించడం ఎలా?
శని సడే సతీ, దయ్యా ప్రభావాలు తొలగిపోయేలా చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించి తప్పించుకోవచ్చు. శనివారం నాడు రావి చెట్టు, శమీ చెట్టుని పూజించాలి. అలాగే శని వారం రావి చెట్టుకు, శమీ చెట్టుకి నీరు సమర్పించాలి. సాయంత్రం ఆవ నూనెలో నల్ల నువ్వులు కలిపి చెట్టు ముందు దీపం వెలిగించాలి. శని దేవుని ఆశీస్సులు పొందటం కోసం శమీ చెట్టుని పూజించడం చాలా మంచిది. ప్రతిరోజూ శని చాలీసా, శివ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల ఆయన శని దేవుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆ రోజు మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.