Salt for vastu: వాస్తు దోషాలు తొలగించేందుకు మాత్రమే కాదు ఉప్పుతో మరెన్నో ప్రయోజనాలు
Salt for vastu: ఉప్పుతో వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. అది మాత్రమే కాదు ఉప్పుతో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Salt for vastu: ప్రతి ఒక్కరి వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం ఉప్పు. ఇది కూరలకి మంచి రుచి ఇస్తుంది. చాలా మంది ఉప్పుని పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఉప్పు నేలరాలకూడదని చెప్తారు. శతాబ్దాలుగా అనేక సంస్కృతులలో ఉప్పు అధ్యాత్మికంగా, వైద్యం చేసే పద్ధతులకు ఉపయోగిస్తున్నారు.
మతపరమైన ఆచారాల్లో ఉప్పు ప్రాముఖ్యత
పురాతన నాగరికతలలో ఉప్పుని స్వచ్చత, సంరక్షణని సూచిస్తుంది. మానవ మనుగడకి కీలకమైనది ఉప్పు. రుచిని మెరుగుపరిచే లక్షణాల కంటే ఎక్కువగా గౌరవిస్తారు. శుద్ధికరణ ఆచరాలలో ఉప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే తరచుగా నిర్దిష్ట ప్రాంతాల్లో ఉప్పు చల్లడం లేదా ఉంచడం చేస్తారు. మలినాలని, ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు. అనేక సాంప్రదాయాలలో ప్రతికూల శక్తులని నివారించడానికి ఉప్పుని ఇంటి మూలలో లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు.
ఈ ఆచారం తరతరాలుగా వస్తుంది. ఆధ్యాత్మిక శ్రేయస్సుని ప్రోత్సహించేందుకు ఒక స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్థిక కష్టాలు తొలగిపోవడం కోసం ఇంట్లో చాలా ఉప్పుతో ఐశ్వర్య దీపం పెడతారు. ఆధ్యాత్మిక అభ్యాసాలలో ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.
మతపరమైన ఆచారాలు, సంస్కృతులలో ఉప్పు అనేది సంరక్షించడాన్ని సూచిస్తుంది. అందుకే వేడుకల సమయంలో ఉప్పు నీళ్ళు చిలకరించడం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తుల్ని దూరం చేస్తుందని నమ్ముతారు.
వాస్తు కోసం ఉప్పు
ఉప్పుని వస్త్రంలో కట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఉప్పు మూట గుమ్మానికి కట్టి ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. బాత్ రూమ్ లో ఒక మూలన పెడితే నెగటివ్ ఎనర్జీతో పాటు వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో ఉప్ప ఉంచితే ధనలాభం కలుగుతుంది.
హిమాలయన్ ఉప్పు
హిమాలయ ఉప్పు లేదా పింక్ సాల్ట్ తో తయారు చేసిన ల్యాంప్స్ ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుందని నమ్ముతారు. ఇందులోని వైద్యం చేసే లక్షణాల వల్ల ప్రజాదరణ పొందింది. ఈ దీపాలు ప్రతికూల శక్తిని తటస్థం చేసే అయాన్ లని విడుదల చేస్తుంది. దీని వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇండోర్ గాలి నాణ్యతని మెరుగుపరుస్తుంది. ఈ ల్యాంప్ లు వెచ్చగా ఉండటమే కాదు మనసుకి ఓదార్పుని ఇస్తాయి. మనసుకి విశ్రాంతిని ఇస్తుంది.
సాల్ట్ బాత్ థెరపీ
స్నానం చేసే నీళ్ళలో ఉప్పు వేసుకుని చేయడం చాలా మంచిదని చెప్తారు. మెగ్నీషియం, సల్ఫేట్ సమృద్ధిగా ఉండే ఎప్సమ్ సాల్ట్ ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. నీటిలో ఈ ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల కండరాలకి ఉపశమనం కలుగుతుంది.
డెడ్ సీ సాల్ట్ వేసుకుని స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరుస్తాయి. శక్తి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయి. వెచ్చని నీటిలో ఈ ఉప్పు వేసుకుని స్నానం చేస్తే విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది భౌతికంగా, మానసికంగా శరీరంలోని విషాన్ని బయటకి తీస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీవ శక్తిని పెంపొందిస్తుంది.