తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు, వ్యాపారులకు ఈ వారం లాభదాయకం

వార ఫలాలు.. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు, వ్యాపారులకు ఈ వారం లాభదాయకం

HT Telugu Desk HT Telugu

28 April 2024, 2:00 IST

  • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 4వరకు
వార ఫలాలు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 4వరకు (freepik)

వార ఫలాలు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 4వరకు

రాశిఫలాలు (వార ఫలాలు) 28.04.2024 నుండి 04.05.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

సంవత్సరం : శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : చైత్రం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూములు, వాహనములు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదముల నుండి గట్టేక్కుతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. చిరాస్తి వివాదములు పరిష్కారం అవుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సమస్యలు, శారీరక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తికాగలవు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయున్ని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశములుంటాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ నాయకులు శుభవార్తలు వింటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

వార ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొత్త పెట్టుబడులు అందుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ధన వ్యయముండును. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆస్తి వివాదములు పరిష్కారమవుతాయి. వాహనములు, గృహములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్టులకు మధ్యస్థ సమయం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. శత్రువులు మిత్రువులుగా మారతారు. కొన్ని విషయాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. గృహనిర్మాణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగస్థులకు అనుకూల మార్పులు ఉంటాయి. ధన వ్యయముండును. శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు. అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. స్థిరాస్తి వివాదములు పరిష్కార దిశకు చేరతాయి. ఆరోగ్యం అనుకూలం. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనములు, భూములు కొనుగోలు చేస్తారు. సభలు సమావేశములలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు అనుకొన్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కళారంగం వారికి కొత్త అవకాశాలుంటాయి. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వాహనములు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్థులకు పదోన్నతులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

వార ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆస్తి వివాదములు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నములు నెమ్మదిగా సాగుతాయి. గృహ నిర్మాణాల్లో ఆటంకాలుంటాయి. వ్యాపాస్తులకు మద్యస్థ సమయం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. వాహన యోగముంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని వివాదముల నుండి బయట పడతారు. నిరుద్యోగలుకు శుభవార్తలు. వ్యాపారస్తులకు లాభదాయకం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథపప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకోని పదోన్నతులు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దుబారా ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం