Dakshinamurthy sthotram: దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?
Dakshinamurthy sthotram: అంతిమ గురువుగా దక్షిణామూర్తిని భావిస్తారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఏకాగ్రత పొందుతారు. జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి.
Dakshinamurthy sthotram: సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తి భావిస్తారు. మర్రి చెట్టు కింద కూర్చొని రుషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది. త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వరపరచిన దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన. అంతిమ అవగాహన, జ్ఞానం కలిగిన వ్యక్తిగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు. అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెప్తారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణామూర్తికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి.
సర్వోన్నత గురువుగా ఆయనను పూజిస్తారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వరపరిచారు. పది శ్లోకాలతో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతారు. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ సూత్రాలు వివరిస్తాయి.
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరోవోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కుఋతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..||
బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యంచిత్రీకృతం
మాయావీయ విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్చయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..|||
యస్వైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్తవ్యమసీతి వేదవచసా యో బోధయత్యాశితాన్
యత్శాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||
నానాచ్చిద్రఘటో దరస్థితమహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||
దేహం ప్రాణమా పీంద్రియాణ్యాపి చలాం బుద్ధిః చ శూన్యం విదుః
స్త్రీబాలాంఢజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః|
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||
రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాఛ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభి జ్ఞాయతే
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషొ మాయాపరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||
భూరంభాంస్యనలో నిలో మ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యవ మూర్త్వష్టకం
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రావణాత్తదర్థమననాద్ధానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ద్ధ్యేత్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం||