Saturn transit: ఈ ఏడాది మొత్తం శశ రాజయోగం.. మూడు రాశుల వారికి శని ఆశీస్సులతో డబ్బే డబ్బు-saturn transit in kumbha rashi will manage shasha rajayogam in this year ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: ఈ ఏడాది మొత్తం శశ రాజయోగం.. మూడు రాశుల వారికి శని ఆశీస్సులతో డబ్బే డబ్బు

Saturn transit: ఈ ఏడాది మొత్తం శశ రాజయోగం.. మూడు రాశుల వారికి శని ఆశీస్సులతో డబ్బే డబ్బు

Gunti Soundarya HT Telugu
Apr 24, 2024 03:21 PM IST

Saturn transit: శని దాని మూల త్రికోణ రాశిలో ఉండటం వల్ల శశ రాజయోగం ఏర్పడింది. ఈ ఏడాది మొత్తం ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వారికి శని ఆశీస్సులు ఉండనున్నాయి.

శని శశ రాజయోగం
శని శశ రాజయోగం

Saturn transit: జ్యోతిష్య శాస్త్రంలో శనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మం, న్యాయం, కర్మల అనుసారంగా ప్రతిఫలం ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు.నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని ఒకటి. 

శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారెందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని సంచారం మొత్తం 12 రాశుల వారిని ప్రత్యేక పద్ధతిలో ప్రభావితం చేస్తుంది.

శని ప్రస్తుతం తన మూల త్రికోణ రాశి ఆయన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా శశ రాజయోగం ఏర్పడింది. శని వల్ల ఏర్పడిన శశ రాజయోగం కొన్ని రాశుల వారికి ఈ ఏడాది మొత్తం అదృష్టాన్ని ఇస్తుంది. శని ఉచ్ఛమైన రాశి తుల లేదా దాన్ని సొంతరాశులైన మకరం లేదా కుంభ రాశిలో ఉన్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. శని కేంద్ర గృహాలలో 1, 4, 7, 10 లేదా త్రికోణ గృహాలు ఒకటి, ఐదు, తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది.  ప్రస్తుతం శని దాన్ని మూల త్రికోణ రాశి కుంభ రాశిలో ఉండటం వల్ల ఈ ఏడాది శశ రాజయోగం ఉంటుంది. 

ఈ రాజయోగం ప్రభావంతో క్రమశిక్షణ, పట్టుదల, కృషితో హోదా అధికారం, శక్తి లభిస్తుంది. శని సంచారం కొన్ని సార్లు సవాళ్ళతో కూడినప్పటికీ ఈ యోగం జన్మ చార్టులో ఉంటే స్థిరత్వం, దీర్ఘాయువు, నాయకత్వం, అధికార స్థానాల్లో గౌరవం లభిస్తుంది. శశ రాజయోగంతో మూడు రాశుల వారికి సమృద్ధికరంగా శని ఆశీర్వాదాలు ఉండనున్నాయి. శని ఆశీస్సులు పొందే రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. 

కుంభ రాశి

కుంభ రాశి లగ్న గృహంలో శశ రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశిలో శని ఉన్న సమయం వరకు వీరికి అదృష్టం, ఆశీర్వాదం లభిస్తాయి. ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ఏ రంగం నుండైనా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాన్ని నడుపుతున్న జాతకులు మంచి లాభాలను అర్జిస్తారు. ఉపాధి పొందే వారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వాతావరణం సంతోషంగా, శాంతి పూర్వకంగా ఉంటుంది. వివాహితులు ఈ సమయంలో వారి జీవితాన్ని ఆస్వాదిస్తారు. 

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారు శని సడే సతి చివరి దశలో ఉన్నారు. శశ రాజయోగం కారణంగా వీరికి నిలిచిపోయిన పనులన్నీ నెరవేరపోతున్నాయి. భౌతిక సౌకర్యాలు విలాసాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్తగా పెళ్లయిన వారు గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి. 

వృషభ రాశి 

వృషభ రాశిపై శశ రాజయోగం సానుకూల ప్రభావం చూపనుంది. అన్ని వ్యూహాలు ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు వచ్చేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని పాత పెట్టబడులు మంచి రాబడిని తీసుకొస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఇది వృత్తిపరమైన పురోగతి, డబ్బు సంపాదించేందుకు అనువైన సమయం. 

 

WhatsApp channel