Jupiter venus conjunction: 12 ఏళ్ల తర్వాత రెండు గ్రహాల కలయిక.. అద్భుతమైన రాజయోగంతో ఈ రాశులకు అధిక ప్రయోజనాలు-jupiter venus conjunction after 12 years these zodiac signs will get luck in next month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Venus Conjunction: 12 ఏళ్ల తర్వాత రెండు గ్రహాల కలయిక.. అద్భుతమైన రాజయోగంతో ఈ రాశులకు అధిక ప్రయోజనాలు

Jupiter venus conjunction: 12 ఏళ్ల తర్వాత రెండు గ్రహాల కలయిక.. అద్భుతమైన రాజయోగంతో ఈ రాశులకు అధిక ప్రయోజనాలు

Gunti Soundarya HT Telugu
Apr 24, 2024 11:09 AM IST

Jupiter venus conjunction: దేవ గురువు బృహస్పతి, శుక్రుడి కలయికతో రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి.

బృహస్పతి శుక్రుడి కలయిక
బృహస్పతి శుక్రుడి కలయిక

Jupiter venus conjunction: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని బాగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన గ్రహాలలో శుక్రుడు ఒకటి. ప్రేమ, సంపద, ఐశ్వర్యం, విలాసం, వైభవం, భౌతిక ఆనందం మొదలైన వాటికి శుక్రుడు కారకుడిగా పరిగణిస్తారు. 

దేవ గురువుగా భావించే బృహస్పతి జ్ఞానం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. మేలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరగనుంది. దీని వల్ల అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

బృహస్పతి మే 1న మేష రాశి వీడి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అటు మే 19న శుక్రుడు ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాయి. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కొన్ని రాశి చక్రాల అదృష్టాన్ని మేల్కోలుపుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చూస్తారు. గురు, శుక్రుడి కలయిక ప్రత్యేక రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు గృహాల కలయిక జూన్ 11 వరకు కొనసాగుతుంది. వృషభ రాశిలో గురు శుక్ర కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. 

మేష రాశి

మేష రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అదే సమయంలో పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి.

వృషభ రాశి 

గురు శుక్ర కలయిక వృషభ రాశి వారి లగ్న గృహంలో ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి వారి విశ్వాసం మెరుగుపడుతుంది. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. వివాహం చేసుకున్న వారి వైవాహిక జీవితం సంతోషంగా, మధురంగా ఉంటుంది. కెరీర్ లో లాభపడతారు. మీడియా, ఫిల్మ్, మోడల్, రైటింగ్, క్రియేటివిటీ రంగాలతో సంబంధం ఉన్నవారు గొప్ప లాభాలను పొందుతారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కుటుంబంలోని సమస్యలు సమసి పోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వృషభ రాశిలోనే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 

సింహ రాశి

సింహ రాశి జాతకులకు కూడా ఈ సంయోగం వల్ల ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారంలో అదృష్టం ఉంటుంది. గురు, శుక్ర కలయిక కర్మ ఇంట్లో ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. జీతం పెరగవచ్చు. పదోన్నతి కూడా లభించవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి డబ్బులు ఏదైనా పథకంలో పెట్టుబడి పెడితే మంచిది. కెరీర్లో కొత్త మైలురాళ్లు సాధించడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

 

WhatsApp channel