మకరంతో సహా ఈ 3 రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
మీన రాశిలో రాహు గ్రహ సంచారం కారణంగా మకరంతో సహా ఈ 3 రాశులు అక్టోబరు నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
రాహు గ్రహ సంచారం కారణంగా మకరంతో సహా పలు రాశుల వారు అక్టోబర్ నుంచి చాలా జాగ్రత్తగాా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక సవాళ్లు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను నీడ గ్రహాలు అంటారు. ఈ గ్రహాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా వివిధ రాశుల జాతకుల జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి.
జాతకుని జన్మజాతకంలో రాహు స్థానము అననుకూలంగా ఉండి అశుభ రాశులు లేదా శత్రు రాశులలో ఉంటే అది ప్రతికూలమైన అంటే అశుభ ప్రభావాన్ని ఇస్తుంది.
2023లో రాహు సంచారం ఎప్పుడు జరుగుతుంది
గత ఏడాది ఏప్రిల్ 12, 2022న రాహువు మేష రాశిలోకి సంచరించాడు. 18 నెలల పాటు ఒక రాశి చక్రంలో సంచారం పూర్తి చేసిన తర్వాత రాహువు ఇప్పుడు మీనరాశి వైపు కదులుతున్నాడు. 31అక్టోబరు 2023న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారిని సంక్షోభ మేఘాలు చుట్టుముడతాయో ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి
రాహు గ్రహము రాశి మార్పు జ్యోతిష శాస్త్రంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. 3ం అక్టోబరు 2023 మేషరాశి నుంచి రాహువు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే మేష రాశి వారికి బాధాకరమైన కాలం మొదలవుతుంది. ఈ సమయంలో మీ సవాళ్లు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బడ్జెట్ రూపకల్పన ప్రణాళికలు తారుమారు అవుతాయి. కలిసికట్టుగా పరిష్కరించుకోవలసిన సమస్యలు అనేకం ఉంటాయి.
వృషభ రాశి
రాహు గ్రహ రాశి మార్పు ప్రభావము వృషభ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. మీ బడ్జెట్ ప్రణాళికలు తారుమారు కావచ్చు. కలిసి పరిష్కరించాల్సిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది.
మకర రాశి
రాహు సంచారము మకర రాశి వారికి అనుకూలంగా ఉండదు. సంవత్సరం చివరిలో ఈ గ్రహం యొక్క సంచారం ప్రభావం వివాదాలను పెంచుతుంది. ఉద్రిక్తతను పెంచుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి దీర్ఘ కాలిక వ్యాధులు తిరిగి ఉద్భవిస్తాయి. కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి. అధిక శ్రమ అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.