తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Sankatahara Chaturthi 2023 Date And Lord Ganesha Vrat Puja Importance To Get Rid Of Obstacles In Life

Sankatahara Chaturthi 2023 । ప్రతీ పనిలో ఆటంకాలా? సంకటహర చతుర్థి నాడు ఇలా చేయండి, నిర్విఘ్నమస్తు!

HT Telugu Desk HT Telugu

09 January 2023, 14:00 IST

    • Sankatahara Chaturthi 2023: కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతాయి, పనులు ముందుకు సాగవు. మీరు చేపట్టే పనులు నిర్విఘ్నంగా సాగాలంటే మీ ముందు ఒక అవకాశం ఉంది. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ సంకటహర చతుర్థి నాడు ఏం చేస్తే శుభకరమో తెలియజేశారు.
Sankatahara Chaturthi 2023
Sankatahara Chaturthi 2023 (Unsplash)

Sankatahara Chaturthi 2023

Sankatahara Chaturthi 2023: ప్రతీ పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఏది కలసి రావడం లేదా? అయితే సంకటహర చతుర్థి మీ కోసమే! పుష్యమాసం తేదీ 10-1-2023, మంగళవారం నాడు కృష్ణ పక్ష చతుర్థి ఉంది. దీనినే సంకటహర చతుర్థి అని పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సనాతన ధర్మంలో ఏ పూజ లేదా వ్రతాన్ని ఆచారించాలన్నా విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడు అంటే గణనాయకుడు, గణాధ్యక్షుడు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి ధన యోగం.. ఆర్థిక కష్టాలు దూరం- కుటుంబంలో సంతోషం..

Apr 29, 2024, 09:45 AM

డబ్బంతా ఈ రాశుల వారిదే! ఉద్యోగంలో ప్రమోషన్​, వ్యాపారంలో లాభాలు..

Apr 28, 2024, 10:47 AM

ఏప్రిల్ 28, రేపటి రాశి ఫలాలు.. ఐటీ రంగంలో పని చేసే వాళ్ళు రేపు జాగ్రత్తగా ఉండాలి

Apr 27, 2024, 08:38 PM

Lord Venus : శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఇబ్బందులు

Apr 27, 2024, 03:03 PM

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

Jupiter Venus conjunction: గురు శుక్ర సంయోగం.. గజలక్ష్మీ రాజయోగంతో వీళ్ళు విజయ శిఖరాలు చేరుకుంటారు

Apr 26, 2024, 03:28 PM

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికి అయితే తన జీవితములో ఆటంకములు అధికముగా ఉన్నా, ఏ పని ముందుకు సాగకపోయినా, ప్రతీ పనియందు విఘ్నములు కలిగినా... అటువంటి వారికి సంకటహర చతుర్థి నాడు చేసే వ్రతము లేదా పూజ ఒక గొప్ప అవకాశము.

సంకటహర చతుర్థిన విఘ్నేశ్వరుడి పూజ ప్రాముఖ్యత

ప్రతీ మాసములో బహుళ పక్షములో వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా చెప్పబడినది. విఘ్నేశ్వరుడికి చవితి అంటే చాలా ఇష్టమైన తిథి. ప్రతీ మాసములో వచ్చే బహుళ పక్ష చవితి రోజు, విశేషముగా సాయంకాల సమయమందు ఈ చవితి ఉన్నట్లయితే అట్టి సమయములో విఘ్నేశ్వర ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది. వారికి జీవితంలో ఉన్న కష్టములు అన్నీ తొలగిపోయి, సర్వకార్య సిద్ధి, విజయము కలుగుతుంది.

సంకటహర చతుర్థి రోజు సాయంత్ర సమయమందు విఘ్నేశ్వరుని సంకటహర చతుర్థి వ్రత కల్పము ద్వారా పూజ చేయాలి. అలాగే ఈ రోజు కుడుములు, ఉండ్రాళ్ళను విఘ్నేశ్వరుని నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఏ వ్యక్తి అయినా సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించినట్లు అయితే వారికి కష్టములు తొలగి శుభ ఫలితములు కలుగుతాయని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సంకటహర చతుర్థి వ్రతములో విఘ్నేశ్వరుని గరికతో పూజించాలి. విఘ్నేశ్వరుని గరికతో పూజించుట వలన శుభఫలితాలు కలుగుతాయి. ఇలా సంవత్సంలో 11సార్లు ఎవరైతే సంకటహర చతుర్థి ఆచరిస్తారో వారికి విఘ్నశ్వరుని ఆశీర్వచనము లభిస్తుంది. వారు చేపట్టే ప్రతీ కార్యంలో విజయప్రాప్తి కలిగి అనేక కోరికలు నెరవేరుతాయని పురాణాలు తెలిపాయి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ