తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Plot | ఇంటి కోసం స్థలం కొంటున్నారా? ఈ వాస్తు నియమాలు చూసుకోండి!

Vastu Tips for Plot | ఇంటి కోసం స్థలం కొంటున్నారా? ఈ వాస్తు నియమాలు చూసుకోండి!

HT Telugu Desk HT Telugu

04 January 2023, 19:29 IST

    • Vastu Tips for Plot Selection: మీరు ఇంటి నిర్మాణం కోసం ఎంచుకునే స్థలం వాస్తు ప్రకారంగా ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేశారు, వాటిని ఈ పరిశీలించండి.
Vastu Tips for Plot Selection
Vastu Tips for Plot Selection (Unsplash)

Vastu Tips for Plot Selection

చాలా మంది నివాస స్థలాలను ప్రధానంగా రెండు అవసరాల కోసం కొంటారు. ఒకటి వారి గృహ నిర్మాణం కోసం లేదా భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుందని పెట్టుబడిగా కొనుగోలు చేస్తారు. మీరు భవిష్యత్తులో గృహ నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేస్తున్నట్లయితే వాస్తు నియమాలను పాటించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉత్తమ నివాస స్థలాలను గుర్తించడానికి వాస్తు శాస్త్రం ఒక ఆధారం. వాస్తు అనుకూల ప్లాట్లు కొనుగోలు చేసి అక్కడ నివాసం ఏర్పర్చుకుంటే, అది చోట నివాసం ఉండే కుటుంబ సభ్యులు మరింత ఆనందంగా, ధనవంతులుగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఉత్తరం, తూర్పు, ఈశాన్య మూలలు కలిగిన స్థలాలు సహజంగా వాస్తులో మంచివి. దక్షిణం, పశ్చిమం, నైరుతి, వాయువ్యం దిశలలో కొనుగోలు చేసినప్పటికీ, వాస్తు నియమాల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే అవి శుభ ఫలితాలను అందిస్తాయి. కాబట్టి మీ ఇంటికి సరైన దిశను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నివాసుల వృత్తికి సంబంధించి ప్లాట్ల ఎంపిక చేసుకోవడం కూడా మంచిదే.

Vastu Tips for Plot Selection- స్థలం ఎంపికకు వాస్తు నియమాలు

మీరు ఇంటి నిర్మాణం కోసం ఎంచుకునే స్థలం వాస్తు ప్రకారంగా ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేశారు, వాటిని ఈ పరిశీలించండి.

- వాస్తు దేవత శరీరం ప్లాట్‌పై విలోమ రూపంలో ఉంటుంది. వాస్తు దేవత తల భాగం ఈశాన్యంలో, పాదాలు నైరుతి వైపు ఉంటాయి అని చెబుతున్నారు. అంటే నార్త్-ఈస్ట్, తూర్పు, ఈశాన్యం వైపు ముఖద్వారం కలిగిన ప్లాట్స్ ఎంచుకోవాలి. ప్లాట్ ఆకృతి ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా దీర్ఘచతురస్రం లేదా చతురస్రం ఆకారంలో ఉండాలి. అలాగే, ప్లాట్ నిష్పత్తి 1:3 కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ధారించుకోండి.

- ఇప్పుడు ప్లాట్ పరిసరాల విషయానికి వస్తే, మీ ప్లాట్ నుండి 100 అడుగుల దూరంలో మందిరం ఉండకూడదు. ఉత్తరం లేదా తూర్పు వైపు మీకు బహిరంగ ప్రదేశం ఉంటే, నది, చెరువు లేదా భూగర్భ ట్యాంక్ వాస్తులో అనుకూలంగా ఉంటుంది. మీకు దక్షిణం లేదా పడమర వైపు పర్వతాలు, ఏవైనా భారీ భవనాలు ఉంటే, అది కూడా వాస్తు ప్రకారం చాలా మంచిది.

- మీరు ఎంచుకున్న స్థలం వాస్తుప్రకారంగా అన్ని అనుకూలతలు కలిగి ఉన్నప్పటికీ దగ్గరగా సమాదులు, శ్మశాన వాటిక ఉంటే వాస్తు శక్తికి భంగం వాటిల్లుతుంది. అటువంటి ప్లాట్ ఎంచుకోకూడదు. అలాగే స్థలానికి ఎదురుగా ఏదైనా విద్యుత్ స్తంభం లేకుండా చూసుకోవాలి.

- వాస్తులో నేల కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నేల రంగు, వాసన కూడా ముఖ్యమే. ముఖ్యంగా వ్యాపారస్తులు స్థలం కొనుగోలు చేసేటపుడు ఆ స్థలంలోని మట్టిని వాస్తు శాస్త్ర నిపుణులతో తనిఖీ చేయించండి. ఆ మట్టిలో సంపద వృద్ధి చెందుతుందో లేదో కనుక్కోండి.

- స్థలంలో ఎముకలు, గోర్లు ఉండకూడదు. మీరు స్థలం త్రవ్వేటప్పుడు ఎముకలు లేదా గోర్లు బయటపడితే.. ఆ స్థలం పై పొరను పూర్తిగా తీసివేసి, శుభ్రమైన మట్టితో నింపండి. భూమి పూజ చేయాలి, ఈశాన్యంలో కలశం, నాగ నాగిని ఉంచడం తప్పనిసరి. వాస్తు పూజ కూడా పరిసరాలను సానుకూలంగా చేస్తుంది.

- స్థలంలో ఉత్తరం లేదా తూర్పున వాలు ఉన్న ప్లాట్లు శుభప్రదం. సహజ వాలు ఈ దిశలో లేకుంటే, మీరు తప్పనిసరిగా మట్టిని నింపి ఈ దిశల వైపు వాలును సృష్టించాలి.

- మీరు పాఠశాల ఉపాధ్యాయులైతే, తూర్పు ముఖంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవచ్చు. బ్యాంకింగ్ రంగం లేదా ఫైనాన్స్‌లో పని చేసే వ్యక్తులు ఈశాన్య లేదా ఉత్తర ప్లాట్‌కి వెళ్లవచ్చు, పార్లర్ లేదా సెలూన్ లేదా రెస్టారెంట్ యజమాని, గ్లామర్ పరిశ్రమకు చెందిన వారైతే ఆగ్నేయ దిశకు ప్రాధాన్యత ఇవ్వండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.

టాపిక్