Navaratri 2022 Day 8 । దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు.. అష్టమి రోజు పూజా విధానం ఇదీ!
03 October 2022, 4:30 IST
- Navaratri 2022 Day 8: నవరాత్రులలో 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిదవ రోజు పూజా విధానం, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, మహాకాళి ఆవిర్భావం కథ, ఇతర విశేషాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరశర్మ గారు వివరించారు. 8వ రోజుకు సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Navaratri 2022 Day 8: Durga Devi Avataram
Navaratri 2022 Day 8: దేవీ నవరాత్రులలో 8వ అవతారం దుర్గాదేవి అవతారం. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు మహాకాళిగా పూజిస్తారు. దేవీ నవరాత్రులలో అత్యంత ప్రాధాన్యమైన రోజు. ఈరోజు ఎంతో విశేషమైన అలంకరణ, పూజ నియమములను ఆచరించ వలసినటువంటి రోజు.
లేటెస్ట్ ఫోటోలు
నవరాత్రి 8వ రోజు దుర్గాదేవి | మహాగౌరీదేవి అవతారము. ఈ రోజు అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందుటకై అగ్ని సూత్రాల మధ్య కఠోర తపస్సు చేసినది. ఆ కఠోర తపస్సు వల్ల ఆమె దేహం నల్లబడుతుంది. నల్లబడిన అమ్మవారి శరీరాన్ని గంగాజలంలో ప్రక్షాళన చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటినుండి ఆ అమ్మవారు మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది.
నవరాత్రి 9 రోజులు 9 అలంకరణలు 9 రకాల దేవతారాధనలు 9 రకాల నైవేద్యములు ఆచరించడం విశేషం. నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేనటువంటి వారికి అతి ముఖ్యమైన 3 రోజులు, 3 అవతారములు 6వ, 7వ, 8వ రోజులలో జరిపేటటువంటి అవతారాలు. ఈ రోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష అష్టమి (దుర్గాష్టమి) ఈ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. విజయవాడలో ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని ఎరుపురంగు వస్త్రముతో అలంకరించాలి. అమ్మవారికి పులిహోర, పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.
సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకములు
1. శివారాధన
2. విష్ణు ఆరాధన
3. శక్తి ఆరాధన
శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ అలాగే దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి.
మహాకాళి ఆవిర్భావం
దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులు వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహా మాయ నిద్రలేపడం జరిగింది. అయితే యోగనిద్ర నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేసినా, వారిని జయించలేకపోవడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించే సమయంలో.. మహా మాయ పదితలలతో, పది కాళ్ళతో, నల్లని రూపుతో మహాకాళి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడెను. ఈ విధముగా మహా మాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడెను. సింహవాహినిగా మహిసాసురుడుని, సరస్వతీ రూపిణిగా సుంబ, నుసుంబులను అలాగే ఛండ ముండులను సంహరించిన ఛాముండిగా, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరిగా, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి.