Kalpeshwar Temple | ఈ ఆలయంలో వెంట్రుకలనే దైవంగా పూజిస్తారు.. విశేషాలు ఇవిగో!
కల్పేశ్వర ఆలయాన్ని పంచ కేదార్లలో ఒకటిగా చెప్తారు. ఇక్కడ పరమ శివుడిని వెంట్రుకల రూపంలో కొలుస్తారు. అలా ఎందుకు చేస్తారో అక్కడి విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
సాధారణంగా ఏ ఆలయంలోనైనా శివుడ్ని లింగం రూపంలోనే పూజిస్తారు. శివుడు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడం చాలా అరుదు. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కల్పేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడిని వెంట్రుకల రూపంలో పూజిస్తారు. సముద్ర మట్టానికి 2,134 మీటర్ల ఎత్తులో గర్వాల్ ప్రాంతంలో ఈ కల్పేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా చిన్నదే అయినప్పటికీ పంచ కేదార్లలో ఐదవ స్థానంలో నిలిచింది.
కల్పేశ్వర్‌కు వెళ్లే మార్గం ఒక గుహలాగా ఉంటుంది. ఆలయానికి చేరుకోవడానికి భక్తులు గుహలోపలికి ఒక కిమీ దూరం నడవాలి. ఇక్కడ శివుని కేశాలను యాత్రికులు దర్శించుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి భక్తులు శివ కేశాలకు పూజలు చేస్తారు.
అయితే కల్పేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వెంట్రుకలకు ఎందుకు పూజ చేస్తారంటే శివునికి జటాధరుడు, జటేశ్వర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో శివుని కేశాలు కనిపించాయని ప్రతీతి. అందుకే ఇక్కడ శివ కేశవులకు పూజలు చేస్తారు.
ఈ ఆలయాన్ని అనాదినాథ్ కల్పేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి సమీపంలో కల్వర్ కుండ్ అనే కొలను ఉంది, ఈ కొలనులోని నీరు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. ఈ పవిత్ర జలాన్ని సేవించడం ద్వారా భక్తులు అనేక రోగాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు.
ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి. మహాభారత యుద్ధం తరువాత పాండవులు, తమ బంధువులను చంపిన అపరాధంతో కుమిలిపోతూ ఆ పాపం పోగొట్టుకోవడానికి శివుని దర్శనం కోసం యాత్రకు బయలుదేరిన ప్రదేశం ఇది. పాండవులు మొదట కాశీకి చేరుకుని శివుని ఆశీస్సులు కోరగా అక్కడ శివుని దర్శనం వారికి లభించకపోవడంతో పాండవులు కేదార్ వైపు తిరిగారు.
ఇక్కడ శివుడు ఎద్దుపై వెళ్తూ అదృశ్యమైనట్లుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. అందుకే కేదార్‌నాథ్‌లో నంది వెనక భాగాన్ని పూజిస్తారు.
శివుని చేతులు తుంగనాథ్‌లో, నాభి మద్మహేశ్వర్‌లో, ముఖం రుద్రనాథ్‌లో అలాగే జటము కల్పేశ్వరంలో కనిపించాయని చరిత్రలో ఉంది. అందుకే ఈ ఐదు ప్రదేశాలను పంచ కేదార్లు అని పిలుస్తారు.
సంబంధిత కథనం
టాపిక్