Festivals in October : అక్టోబర్లో వచ్చే పండుగలు ఇవే.. ఓ లుక్ వేయండి..
01 October 2022, 12:04 IST
- Festivals in October : దసరా, దీపావళి వంటి అనేక పండుగలు అక్టోబర్‌లోనే వస్తాయి. అయితే ఈ నెలలో ఇంకా విశిష్టమైన పండుగలు, రోజులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్లో వచ్చే పండుగలు ఇవే
Festivals in October : అక్టోబరు 2022 పూర్తిగా పండుగలతో నిండిన నెల అని చెప్పవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రస్తుతం ఆశ్వయుజం కార్తీక మాసం శుక్ల పక్షం నడుస్తోంది. అక్టోబర్ 9న పౌర్ణమి తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దసరా, దీపావళి, కర్వా చౌత్ వంటి అనేక పండుగలు అక్టోబర్ 2022లో జరుపుకుంటారు. మరి అవేంటో ఇప్పుడు చుద్దాం.
లేటెస్ట్ ఫోటోలు
అక్టోబర్లో వచ్చే పండుగలు ఇవే
* అక్టోబర్ 01 : శనివారం, స్కంద షష్ఠి
* అక్టోబర్ 02 : ఆదివారం, సరస్వతీ పూజా ప్రారంభం , లాల్ బహదూర్ శాస్త్రి జయంతి , గాంధీ జయంతి , దుర్గాపూజ
* అక్టోబర్ 03 : సోమవారం, సద్దుల బతుకమ్మ , దుర్గా అష్టమి వ్రతం , సరస్వతి పూజ , దుర్గాష్టమి
* అక్టోబర్ 04 : మంగళవారం, ప్రపంచ జంతు దినోత్సవం , మహా నవమి, సరస్వతి పూజ
* అక్టోబర్ 05 : బుధవారం, దసరా (విజయ దశమి)
* అక్టోబర్ 06 : గురువారం, పాపాంకుశ ఏకాదశి
* అక్టోబర్ 07 : శుక్రవారం, ప్రదోష వ్రతం
* అక్టోబర్ 09 : ఆదివారం, మిలాద్ ఉల్ నబి , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , వాల్మీకి జయంతి , శ్రీ సత్యనారాయణ పూజ
* అక్టోబర్ 10 : సోమవారం, చిత్త కార్తె
* అక్టోబర్ 12 : బుధవారం, అట్ల తద్దె
* అక్టోబర్ 13 : గురువారం, సంకష్టహర చతుర్ధి , కర్వా చౌత్
* అక్టోబర్ 17 : సోమవారం, తుల సంక్రమణం
* అక్టోబర్ 18 : మంగళవారం, తులా కావేరి స్నానం
* అక్టోబర్ 21 : శుక్రవారం, రామ ఏకాదశి
* అక్టోబర్ 23 : ఆదివారం, ధన్వంతరి జయంతి , ధనత్రయోదశి , మాస శివరాత్రి , ప్రదోష వ్రతం , ధన్తేరస్
* అక్టోబర్ 24 : సోమవారం, నరక చతుర్దశి , కేదార గౌరీ వ్రతం , స్వాతి కార్తె
* అక్టోబర్ 25 : మంగళవారం, దీపావళి, అమావాస్య
* అక్టోబర్ 26 : బుధవారం, ఆకాశ దీపం ప్రారంభం , చంద్రోదయం , గోవర్ధన పూజ
* అక్టోబర్ 27 : గురువారం, భగినీ హస్త భోజనం , యమ ద్వితీయ
* అక్టోబర్ 28 : శుక్రవారం, నాగుల చవితి , చతుర్థి వ్రతం
* అక్టోబర్ 30 : ఆదివారం, స్కంద షష్ఠి , సూర్య షష్ఠి
* అక్టోబర్ 31 : సోమవారం, సోమవార వ్రతం