Jio to launch 5G services by Diwali : దీపావళి నాటికి జియో '5జీ’.. ముకేశ్ అంబానీ ప్రకటన
Reliance AGM 2022 : రిలయన్స్ ఏజీఎం.. సోమవారం జరిగింది. ఈ నేపథ్యంలో.. జియో 5జీని దీపావళి నాటికి తీసుకురానున్నట్టు ముకేశ్ అంబానీ ప్రకటించారు.
Jio to launch 5G services by Diwali : జియో వినియోగదరులకు అదిరిపోయే వార్త! ఈ ఏడాది దీపావళి నాటికి.. అంటే మరో రెండు నెలల్లో జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. సోమవారం జరిగిన రిలయన్స్ ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో.. ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు.
"డిజిటల్ కనెక్టివిటీలో కొత్త శకం మొదలుకానుంది. అదే జియో '5జీ'. 5జీతో.. 100 మిలియన్ ఇళ్లు కనెక్ట్ అవుతాయి. మెరుగైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. జీయో 5జీతో అందరిని, అన్ని ప్రాంతాలను, ప్రతి విషయాన్ని కలుపుకుంటూ వెళతాము. అత్యంత నాణ్యమైన సేవలు లభిస్తాయి. భారత దేశ అవసరాలతో పాటు.. అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక 5జీ నెట్‌వర్క్‌గా మన జీయో 5జీ నిలుస్తుంది. 5జీ లెటెస్ట్ వర్షెన్.. 'స్టాండ్అలోన్-5జీ'నీ తీసుకొస్తున్నాము. 4జీ నెట్‌వర్క్‌తో దీనికి అసలు సంబంధమే ఉండదు," అని రిలయన్స్ ఏజీఎంలో.. ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు.
Reliance Industries Limited : దేశవ్యాప్తంగా జియో 5జీ సేవల కోసం రూ. 2లక్షల కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు తెలిపారు ముకేశ్ అంబానీ. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో జియో 5జీ సేవలు తొలుత అందుబాటులోకి రానున్నాయని, 2023 చివరి నాటికి.. దేశంలోని ప్రతి పట్టణానికి ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.
స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ప్రైజ్ ప్రస్తుతం.. 18 పాయింట్ల నష్టంతో 2,600 వద్ద ఉంది.
రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ స్పీచ్ హైలైట్స్..
- గ్రే హైడ్రోజన్ నుంచి గ్రీన్ హైడ్రోజన్‌కు 2025 నాటికి రిలయన్స్ మారుతుంది.
- Mukesh Ambani Reliance AGM speech : బయో ఎనర్జీపై యాక్టివ్‌గా పరిశోధనలు చేస్తున్నాము. జామ్‌నగర్‌లో బయో ఎనర్జీ టెక్నాలజీ సెంటర్ ఫేస్ 1ను ప్రారంభించాము.
- 2035 నాటికి నెట్ కార్బన్ జీరో ఎమిషన్ లక్ష్యాన్ని సాధించేందుకు రిలయన్స్ కృషిచేస్తోంది.
- ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌లో.. నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు పని జరుగుతోంది. సోలార్ ప్యానెళ్లు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఫ్యూయెల్ సెల్స్ వంటి వాటిని తయారీ చేస్తాము.
- గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ కట్టుబడి ఉంది.
సంబంధిత కథనం