Goddess Durga Avatars : నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఇవే..-avatars of goddess durga worshiped on 9 days in navaratri 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Avatars Of Goddess Durga Worshiped On 9 Days In Navaratri 2022

Goddess Durga Avatars : నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 27, 2022 10:00 AM IST

Goddess Durga Avatars : నవరాత్రులు.. అంటే తొమ్మిది పవిత్ర రాత్రులు. హిందూ మతంలో ఇవి అత్యంత పవిత్రమైన రోజులుగా చెప్పవచ్చు. చెడుపై దేవత శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారాల్లో కనిపిస్తారు. ఇంతకీ ఆ అవతారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఇవే..
నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఇవే..

Goddess Durga Avatars : నవరాత్రులను వివిధ పద్ధతుల్లో దేశమంతా జరుపుకుంటారు. వారి స్థానిక క్యాలెండర్ ఆధారంగా.. భక్తులు వివిధ నెలలలో పండుగ చేసుకుంటారు. వసంత లేదా చైత్ర నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శరద్ నవరాత్రి (శారదీయ నవరాత్రి), పౌష్ నవరాత్రి, మాఘ నవరాత్రులు. ఇలా పలు విధాలుగా నవరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే దీనికి మతపరమైన ప్రాముఖ్యత చాలా ఉంది. తెలంగాణలో నవరాత్రులు, బతుకమ్మ ఒకేసారి జరుపుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

నవరాత్రి, బతుకమ్మను కూడా భక్తులు తొమ్మిది రోజులు చేసుకుంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో భక్తులు అంకితభావంతో ఉపవాసాలు పాటిస్తారు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి రోజు దేవత ప్రత్యేక అవతారానికి అంకితమిస్తారు.

1. శైలపుత్రి

మొదటిరోజు అమ్మవారు త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) సామూహిక శక్తిని సూచించే "శైలపుత్రి"గా అమ్మవారు దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె. ప్రకృతి, స్వచ్ఛతకు ప్రతీక. శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు.

2. బాలా త్రిపుర సుందరీదేవి (బ్రహ్మచారిణి)

రెండోరోజు అమ్మవారు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురా త్రయంలో మొదటి దేవత. అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత. అందుకే రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. కుమారి పూజ చేస్తారు.

3. చంద్రఘంట దేవి

దుర్గాదేవిని "చంద్రఘంట" రూపంలో పూజిస్తారు. ఆమె అందం, ధైర్యానికి ప్రతీక. నవరాత్రి పూజలో 3వ రోజున.. చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ.. నుదిటి మీద చంద్రవంకలా చంద్రుడిని అలంకరిస్తారు.

4. కూష్మాండ దేవి

నాలుగో రోజు దుర్గాదేవిని కూష్మాండ దేవిగా గౌరవిస్తారు. విశ్వాన్ని, జీవితానికి చిహ్నంగా.. అమ్మవారు నవ్వుతూ దర్శనమిస్తారు.

5. స్కందమాత

ఐదోవ రోజు అమ్మవారిని "స్కందమాత" అవతారంలో పూజిస్తారు. తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా.. రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్భలమైన తల్లిని సూచిస్తుంది. ఆమె శిశురూపంలో స్కంద (కార్తికేయ)తో కలిసి ఉంటుంది.

6. కాత్యాయని

ఆరవ రోజు అమ్మవారు "కాత్యాయని" రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారు ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. పురాణం ప్రకారం.. ఒక ప్రసిద్ధ ఋషి "కట" తనకు కుమార్తె రూపంలో దుర్గ దేవిని కోరుకుని.. తపస్సు చేసాడు. కాట తపస్సుకు చలించిపోయిన దుర్గ అతని కోరికను తీర్చింది. ఆమె కాట కుమార్తెగా జన్మించింది.

7. కాళరాత్రి

అమ్మవారిని 7వ రోజు శక్తి దేవిని "కాళరాత్రి"గా పూజిస్తారు. ఇది అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం. ఆమె కాళి వంటి ముదురు రంగు చర్మం, చిందరవందరగా ఉన్న జుట్టు, ప్రకాశవంతంగా ప్రకాశించే మూడు కళ్లతో దర్శనమిస్తారు. ఇది అమ్మవారి ఉగ్ర రూపం.

8. మహా గౌరి

ఎనిమిదోవ రోజు దుర్గాదేవి అవతారం "మహా గౌరి"గా దర్శనమిస్తారు. అమ్మవారు తెలివి, శాంతిని సూచిస్తారు. ఒక పురాణం ప్రకారం.. హిమాలయాల అడవులలో ఆమె తపస్సు కారణంగా.. ఆమె రంగు చాలా నల్లగా మారింది. తరువాత శివుడు ఆమెను గంగా జలాలతో శుభ్రపరచడంతో.. ఆమె శరీరం తన అందాన్ని తిరిగి పొందింది. అందుకే అమ్మవారికి మహా గౌరీ అని పేరు వచ్చింది.

9. సిద్ధిధాత్రి

నవరాత్రుల్లో చివరి రోజు.. దుర్గాదేవిని "సిద్ధిధాత్రి"గా పూజిస్తారు. ఆమె ఆనందం, దీవెనలు, సానుకూలతను సూచిస్తుంది. సిద్ధిదాత్రి రూపానికి అతీంద్రియ నివారణ శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజును మహా నవమి అని కూడా అంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.