తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri, Herath 2023 : హెరత్ అంటే.. కశ్మీర్ పండిట్లు శివరాత్రి ఎలా జరుపుకొంటారు?

Maha Shivaratri, Herath 2023 : హెరత్ అంటే.. కశ్మీర్ పండిట్లు శివరాత్రి ఎలా జరుపుకొంటారు?

HT Telugu Desk HT Telugu

18 February 2023, 9:38 IST

google News
    • Herath 2023 : మహాశివరాత్రిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నారు. దేశమంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది. కశ్మీర్ పండిట్లు కూడా శివరాత్రిని అత్యంత నిష్టతో జరుపుకొంటారు.
మహాశివరాత్రి 2023
మహాశివరాత్రి 2023

మహాశివరాత్రి 2023

మహాశివరాత్రి(Maha Shivaratri) పండుగ దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. దీనిని జరుపుకొనేందుకు శివభక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. ఆ దేవదేవుడిని పూజిస్తే.. కోరిన కోర్కేలు నెరవేరుస్తాడని నమ్ముతారు. ఈ సంవత్సరం మహాశివరాత్రిని ఫిబ్రవరి 18న జరుపుకొంటున్నారు. కానీ, ఒక రోజు ముందు, కశ్మీరీ పండిట్ల(Kashmiri Pandits)కు శివరాత్రి పండుగ ప్రారంభమవుతుంది. కశ్మీరీ పండిట్ల ఇళ్లలో శివపూజ(Shiva Puja) ఒకరోజు ముందు మెుదలవువతుంది.

లేటెస్ట్ ఫోటోలు

Korean Dramas: కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మిస్ కాకుండా చూడండి.. థ్రిల్ అవడం గ్యారెంటీ

Dec 02, 2024, 09:52 PM

మరో 10 రోజులు ఈ మూడు రాశుల వారికి ఎక్కువగా లక్.. ధనలాభం, గౌరవం దక్కుతాయి!

Dec 02, 2024, 09:49 PM

Magnesium Rich Foods: మెగ్నిషియం మెండుగా ఉండే ఆహారాలు ఇవి.. తప్పక తినాల్సిందే!

Dec 02, 2024, 07:37 PM

Vaccine Benefits: వ్యాధి నిరోధకత పెంచడంలో కీలకం.. వ్యాక్సిన్లను పొరపాటున విస్మరించకండి..

Dec 02, 2024, 05:54 PM

10వేల జీతంతో కూడా కోటి రూపాయలు సంపాదించొచ్చు! ది బెస్ట్​ ఇన్వెస్ట్​మెట్​ స్ట్రాటజీ ఇదే..

Dec 02, 2024, 05:30 PM

AP Weather : ఏపీ వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Dec 02, 2024, 05:09 PM

హెరత్(Herath) అంటే శివారాధన. ఇది శివరాత్రిలో ఒక భాగం. ఇందులో శివ-పార్వతులు(Shiva Parvathi) పూజిస్తారు. శివ ఊరేగింపు చేస్తారు. హెరత్ జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు, దాని సన్నాహాలు ప్రారంభమవుతాయి. కశ్మీరీ పండిట్(Kashmir Pandit) కుటుంబాలు తమ ఇళ్లను బాగా శుభ్రం చేసుకుంటారు. కుటుంబానికి చెందిన వివాహితలు ఈ సమయంలో వారి తల్లి ఇంటికి వచ్చి అక్కడ వారి జుట్టును కడగడం చేస్తారు. దీని తరువాత కుటుంబం నుండి అమ్మాయిలకు బహుమతులు అందిస్తారు.

కశ్మీరీ పండిట్లలో హెరత్ పండుగ(Herath Festival) త్రయోదశి నాడు అంటే మహాశివరాత్రి(Mahaకి ఒక రోజు ముందు ప్రారంభమవుతుంది. సాయంత్రం, కశ్మీరీ పండిట్ల ఇళ్లలో పూజ ప్రదేశాలు అలంకరిస్తారు. కాశ్మీరీ పండితులు వటుకనాథ్ (శివుడు-పార్వతి) పేరుతో కుండలను ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా, కలశం, నాలుగు గిన్నెలు కూడా ఉంటాయి. ఇది శివ ఊరేగింపు చిహ్నం. దుల్జీ అని పిలువబడే అటువంటి రెండు పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు శివుని ఊరేగింపులో భైరోన్ రూపంలో ఉంటాయి.

కశ్మీరీ పండిట్లు మరుసటి రోజు ఉదయం పూజ పూర్తయిన తర్వాత తమ ఇంటిలోని యువకులకు ఏదో ఒకటి ఇస్తారు. దీనినే హెరత్ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఈ డబ్బుతో పిల్లలు తమకు తాముగా వస్తువులు కొంటారు. ఈ రోజున యువతకు ఇంటి పొయ్యి ఖర్చుల గురించి గుర్తు చేస్తుంది. పూజానంతరం అక్రోట్లను ప్రసాదంగా ఇస్తారు. వాల్‌నట్స్‌తో పాటు కశ్మీరీ పండిట్లు ఇంటి ఆడపిల్లలకు అన్నం రొట్టెలను ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదాన్ని శివ-పార్వతుల పెళ్లి ఊరేగింపుల ముందు కూడా అందిస్తారు.

తదుపరి వ్యాసం