తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sunday Remedies: ఆదివారం ఇలా చేశారంటే అదృష్టం, డబ్బు మీ సొంతం అవుతాయి

Sunday remedies: ఆదివారం ఇలా చేశారంటే అదృష్టం, డబ్బు మీ సొంతం అవుతాయి

Gunti Soundarya HT Telugu

03 February 2024, 18:31 IST

google News
    • Sunday remedies: ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. సూర్య భగవానుడి అనుగ్రహంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు. 
ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి
ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి (ANI)

ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి

Sunday remedies: ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడి ఉంటుంది. అలా ఆదివారం సూర్యునికి అంకితం చేశారు. గ్రహాలకి రాజు, అన్ని గ్రహాల కంటే బలవంతుడు సూర్యదేవుడు. ఆదివారం సూర్యభగవానుడిని ఆరాధించడం వాలల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

హిందూ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేకి స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి పూజ చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఎవరి జాతకంలో అయినా సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే వాళ్ళు సూర్యుడికి నీటిని సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్య భగవానుడికి నీటిని సమార్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆదివారం మాత్రమే కాదు ప్రతి రోజు సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉదయం వేళ వచ్చే లేలేత సూర్య కిరణాలు శరీరం మీద పడటం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల నవగ్రహాల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీ జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి.

నీటిని సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు

ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించే సమయంలో మీ రెండు చేతులు తల పైకి ఎత్తి నీటిని కిందకి వదలాలి. అవి కాళ్ళ మీద పొరపాటున కూడా పడకూడదు. అర్ఘ్యం సమర్పించిన వెంటనే మూడు సార్లు ప్రదక్షిణలు చేసి భూమాతకి నమస్కరించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రం జపించాలి. నీటిని సమర్పించేటప్పుడు కుదిరితే ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. నీటిని సమర్పించే సమయంలో మీ మొహం తూర్పు వైపు ఉండాలి.

ఆదివారం సూర్యుడి అనుగ్రహం కోసం పరిహారాలు

వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యభగవానుడు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం నాడు ఉప్పు తినకూడదు. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక సామర్థ్యం పెరుగుతుంది. సూర్య భగవానుడిని పూర్వీకులతో సమానంగా భావిస్తారు. అందుకే ఆదివారం రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. వారికి నచ్చిన పనులు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్య దేవుడి అనుగ్రహం పొందుతారు.

అలాగే ఆదివారం ఇంట్లోని పెద్దలకి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆదివారం నాడు బెల్లం, పాలు, బియ్యం, బట్టలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. నుదుటిపై గంధపు తిలకం రాసుకుంటే మంచిది. ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం పఠించాలి. అలాగే ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం వదిలితే మంచి జరుగుతుంది.

తదుపరి వ్యాసం