Sankashta chaturthi: సంకష్ట చతుర్థి.. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు
Sankashta chaturthi: వినాయకుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ, పిల్లల దీర్ఘాయువు కోసం మహిళలు సకత్ చౌత్ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి.
Sankashtha chaturthi: పిల్లలు దీర్ఘాయువుతో ఉండాలని కోరుకుంటూ తల్లులు ప్రధానంగా చేసే ఉపవాసం సంకష్ట చతుర్థి ఉపవాసం. జనవరి 29న సంకష్ట చతుర్థి జరుపుకుంటున్నారు. దీన్నే సకత్ చౌత్ అని కూడా పిలుస్తారు. సకత్ చౌత్ రోజు సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించకుండా ఈ వ్రతం అసంపూర్ణం.
సకత్ చౌత్ రోజు ఉపవాసం ఉంటే అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి జవితంలో సుఖ సంతోషాలు చేకూరతాయని విశ్వాసం. వినాయకుడికి ఈ ఉపవాసం అంకితం చేయబడి ఉంటుంది. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం చంద్రుడికి నీటిని సమర్పించి ఉపవాసం విరమిస్తారు. అయితే చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు.
చంద్రుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు?
శాస్త్రాల ప్రకారం చంద్రుడిని ఔషధాలకి అధిపతిగా భావిస్తారు. మంచి మనసుకి కారకంగా సూచిస్తారు. చంద్ర దేవుడిని ఆరాధించే సమయంలో స్త్రీలు సంతానం దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది.
చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే లాభాలు
ఒక వెండి పాత్ర తీసుకుని నీటిలో కొద్దిగా పాలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. సాయంత్రం చంద్రుడికి ఆరాధన చేయడం చాలా ప్రయోజనకరం. చంద్రుడికి నీటిని సమర్పించడం వల్ల మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలు, చెడు భవనాలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్రుడి స్థానం కూడా బలపడుతుంది.
ఈ మంత్రం పఠించాలి
చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రం తప్పనిసరిగా జపించాలి.
గగన్నార్నవామానిక్య చంద్ర దక్షయని పేటే
గృహార్ఘ్యం మాయా దత్తా గణేశ ప్రతిరూపక
చంద్రోదయ సమయం
రాత్రి 09.10 గంటలకి చంద్రోదయం వస్తుంది. ఆ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి.
అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు
సకత్ చౌత్ రోజు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించిన తర్వాత సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ ఆచారం పాటించకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీ పాదాల మీద నీరు పడకూడదు.
హిందూ మతంలో శుభకార్యాలు సమయంలో నల్లని దుస్తులు ధరించకూడదు. పూజ సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈరోజు మీరు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం.
వినాయకుడి పూజలో తులసి ఆకులు, మొగలి పువ్వు సమర్పించకూడదు. విరిగిపోయిన బియ్యం కూడా ఎప్పుడు ఉపయోగించవద్దు. వినాయకుడికి దుర్వా గడ్డి అంటే ఎంతో ప్రీతి. అందుకే సకత్ చౌత్ పూజలో తప్పని సరిగా దుర్వా గడ్డిని చేర్చాలి.
వినాయకుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు
సకత్ చౌత్ రోజు బొజ్జ గణపయ్యకి తప్పని సరిగా నువ్వులు, బెల్లం లడ్డూలు సమర్పించడం మరచిపోవద్దు. ఇలా చేయడం వల్ల గణేషుని అనుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. పూజ సమయంలో వినాయకుడికి రెండు తమలపాకులు, రెండు యాలకులు సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.
సకత్ చౌత్ రోజు సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు “ఓం సోమ సోమాయ నమః” అనే మంత్రాన్ని పఠించండి. ఇది మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వినాయకుడిని ఆరాధించే సమయంలో పూజలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి రెండు తమలపాకులు సమర్పించాలి. పూజ చేసిన తర్వాత తమలపాకు, శ్రీయంత్రాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.