Copper sun icon: సంక్రాంతికి రాగి సూర్యుడి ప్రతిమ ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే-makar sankranti 2024 bring copper sun idol in home on this auspicious day you will get wealth and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Copper Sun Icon: సంక్రాంతికి రాగి సూర్యుడి ప్రతిమ ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే

Copper sun icon: సంక్రాంతికి రాగి సూర్యుడి ప్రతిమ ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే

Gunti Soundarya HT Telugu
Jan 15, 2024 11:32 AM IST

Copper sun icon: సంక్రాంతి పండుగ రోజు రాగి సూర్యుడి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సుఖ సంతోషాలకి ఎటువంటి కొదవ ఉండదు.

సూర్యుడి ప్రతిమ
సూర్యుడి ప్రతిమ (pixabay)

Copper sun icon: గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీ వచ్చింది. ఈ పండుగని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి, అస్సాంలో బిహు, గుజరాత్‌లో ఉత్తరాయణం, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు.

ఉత్తరాఖండ్ లోని కుమానోవ్, గర్వాల్ లో ఈ పండుగని జరుపుకుంటారు. కుమానోవ్ లో ఘుగుతి, గర్వాల్ లో కిచిడి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో మకర సంక్రాంతి రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. ఈరోజు పితృ దేవతల ఆరాధనకి ప్రాధాన్యం ఇస్తారు. సంక్రాంతి రోజు పితృ దేవతలకి తర్పణాలు సమర్పించడం వల్ల వారి ఆశీస్సులు కుటుంబం మీద ఉంటాయని నమ్ముతారు.

పవిత్రమైన మకర సంక్రాంతి పర్వదినాన రాగి సూర్యుడి ప్రతిమని ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం వరిస్తుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. వాస్తు నియమాలు ప్రకారం ఇంట్లో రాగి సూర్యుడి బొమ్మ పెట్టుకోవాలి. ఏ దిశలో పెడితే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం.

రాగి సూర్యుడు ప్రతిమ ఏ దిశలో పెట్టాలి?

రాగి సూర్యుడిని సంక్రాంతి రోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం అదృష్టంగా భావిస్తారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం మీకు ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. రాగి సూర్యుడి ప్రతిమని ఇంటికి తూర్పు దిక్కులో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న పూజ గదిలో రాగి సూర్యుడి పెట్టుకోవాలని అనుకుంటే ఈశాన్య మూలలో పెట్టుకోవాలి. ఇది సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.

ఇంటి ప్రధాన ద్వారం లేదా కిటికీపై రాగి సూర్యుడిని ఉంచుకోవాలి. లేదంటే గుమ్మం ఎదురుగా రాగి సూర్యుడి ప్రతిమ గోడకి పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

లివింగ్ రూమ్ లో రాగి సూర్యుడిని పెట్టుకోవడం వల్ల గృహ బాధలు తొలగిపోతాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరింపజేస్తుందని విశ్వసిస్తారు.

ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, వ్యాపారంలో నష్టపోతున్నా కూడా మీరు ఈ రాగి సూర్యుడి ప్రతిమ మీరు ఉండే చోట పెట్టుకోవచ్చు. కార్యాలయంలో గోడపై తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కెరీర్ ఎదుగుదలకి దోహదపడుతుందని నమ్ముతారు.

ఇంట్లోని పడగ గదిలో మాత్రం రాగి సూర్యుడి ప్రతిమ పెట్టుకోకూడదు. ఇది ప్రతికూల శక్తులని ఆకర్షిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది.

రాగి సూర్యుడు ప్రతిమ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు

వాస్తు ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటి బాధలని వదిలించుకోవడంలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇంట్లో ఎప్పుడు సానుకూలత ఉండేలా చేస్తుంది. రాగి సూర్యుడిని పెట్టుకోవడం వల్ల సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం కుటుంబ సభ్యులా మీద ఉంటుందని భావిస్తారు. జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

Whats_app_banner