తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xbb.1.16 Variant: ఎక్స్ బీబీ 1.16 వేరియంట్ తో మరో కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?

XBB.1.16 variant: ఎక్స్ బీబీ 1.16 వేరియంట్ తో మరో కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?

HT Telugu Desk HT Telugu

22 March 2023, 21:37 IST

  • XBB.1.16 variant: గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా కొరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో, ఈ వేసవిలో మరో కోవిడ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

XBB.1.16 variant: దేశంలో కొరోనా (corona)కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా గుర్తించిన XBB.1.16 వేరియంట్ విషయమై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు అయిన రణదీప్ గులేరియా వివరణ ఇచ్చారు.

surge in corona cases: కేసులు పెరగొచ్చు

కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదని, కొరోనా వైరస్ మ్యుటేట్ అవడం వల్ల వల్ల కొత్త కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయని గులేరియా తెలిపారు. అయితే, కొత్తగా పుట్టుకొచ్చిన ప్రతీ వేరియంట్ వల్ల కేసుల సంఖ్య భారీగా ఏమీ పెరగదని వెల్లడించారు. ఇటీవలి కాలంలో గుర్తించిన XBB.1.16 వేరియంట్ వల్ల కేసుల సంఖ్య పెరుగుతుంది కానీ ఆ వేరియంట్ ప్రాణాంతకం కాదని తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండదని, హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం రాదని చెప్పారు. ఇలాంటి వేరియంట్ల వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందన్నారు. XBB.1.16 వేరియంట్ వల్ల కేసుల సంఖ్య పెరుగుతంది కానీ అవి రిపోర్ట్ కావు. ఎందుకంటే, కొరోనా లక్షణాలున్నవారిలో కొందరు మాత్రమే టెస్ట్ కు వెళ్తున్నారు. అలాగే, ఇంట్లోనే యాంటిజెన్ టెస్ట్ చేసుకున్నవారు కూడా పాజిటివ్ గా తేలితే, సంబంధిత అధికారులకు వెల్లడించడం లేదు. అందువల్ల కేసుల సంఖ్య పెరిగినా.. అవి రిపోర్ట్ కావడం లేదు’ అని వివరించారు.

XBB.1.16 variant: మొదట జనవరిలో..

ఈ XBB.1.16 వేరియంట్ ను మొదట జనవరిలో గుర్తించారు. జనవరిలో పరీక్షించిన సాంపిల్స్ లో రెండు కేసుల్లో ఈ XBB.1.16 వేరియంట్ ను గుర్తించారు. అలాగే, ఫిబ్రవరి లో ఈ XBB.1.16 వేరియంట్ ను 59 సాంపిల్స్ లో నిర్ధారించారు. ఇటీవల కొరోనా సోకిన వారి స్యాంపిల్స్ ను పరిశీలిస్తే సుమారు 79 కేసుల్లో ఈ XBB.1.16 వేరియంట్ ను గుర్తించారు. కాగా, మార్చి 21, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 1,134 కొత్త కొరోనా కేసులు నమోదయ్యాయి. గత 138 రోజుల్లో ఇదే అత్యధికం. అలాగే, దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 7,026కి పెరిగింది. దేశంలో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.