తెలుగు న్యూస్  /  National International  /  Viral Video Of Poor Construction Quality Of Road Surfaces In Maharashtra

Viral video : ఇదేందయ్యా ఇది.. వామ్మో! ఇది కొత్తగా వేసినా రోడ్డా?

Sharath Chitturi HT Telugu

02 June 2023, 7:19 IST

  • Viral video : మహారాష్ట్రలోని ఓ రోడ్డును.. స్థానికులు చేతితో పైకి లేపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఫలితంగా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్తగా వేసిన రోడ్డును చేతితో లేపిన గ్రామస్థులు..
కొత్తగా వేసిన రోడ్డును చేతితో లేపిన గ్రామస్థులు..

కొత్తగా వేసిన రోడ్డును చేతితో లేపిన గ్రామస్థులు..

Maharashtra road Viral video : దేశంలో అధికారుల నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితికి అద్దం పట్టే మరో ఘటన ఇది! ఏదో.. నేల మీద పడి ఉన్న కార్పెట్​ను పైకి లేపుతున్నంత సులభంగా.. కొందరు ప్రజలు రోడ్డును లేపేశారు. పైగా.. అది కొత్తగా వేసిన రోడ్డు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

అసలు ఏం జరిగింది..?

సంబంధిత వీడియో.. మహారాష్ట్రకు చెందినదిగా నెటిజన్లు చెబుతున్నారు. వీడియోలో కొందరు మనుషులు ఉన్నారు. కొత్తగా వేసిన రోడ్డు వద్ద నిలబడ్డారు. అనంతరం రోడ్డు కింద వేసిన కార్పెట్​ లాంటి మెటీరియల్​ను చేతులతో ఎత్తి పైకి లేపి పట్టున్నారు! ఆ తర్వాత అధికారులపై మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్​ పేరు రానా థాకూర్​ అని చెబుతూ.. కొత్త రోడ్డు ఒక బోగస్​ అని ఆరోపించారు.

పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్​ తాలూకా కజ్రత్​- హస్త్​ పోఖరి ప్రాంతంలో జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్​ సడక్​ యోజన కింద ఇటీవలే ఈ రోడ్డును నిర్మించారు. వాస్తవానికి ఈ రోడ్డును జర్మన్​ టెక్నాలజీతో రూపొందించినట్టు కాంట్రాక్టర్​ చెప్పాడు. కానీ గ్రామస్థులు సందేహం నిజమైంది. కార్పెంట్​ లాంటి మెటీరియల్​తో రోడ్డును వేసినట్టు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై స్థానికులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులందరినీ శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు షాక్​ అవుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 'ఇలా ఉన్నారేంట్రా మీరు..' అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలు ఇక్కడ చూడండి.

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ.. దేశంలో కనెక్టివిటీని పెంచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచి, నిర్మాణం శరవేగంగా సాగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో.. రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

భారత రోడ్డు వ్యవస్థ..

Maharashtra road latest news : మేక్​ ఇన్​ ఇండియా వెబ్​సైట్​ ప్రకారం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ కలిగిన దేశం ఇండియా. 63.32 లక్షల కిలోమీటర్ల మేర రోడ్డు వ్యవస్థ విస్తరించి ఉంది. కేంద్ర రోడ్డు మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా, పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్స్​ ఆఫ్​ స్టేట్స్​ అండ్​ యూనియన్​ టెరిటరీస్​, నేషనల్​ హైవే అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​, బార్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​, ఇండియన్​ అకాడమీ ఆఫ్​ హైవే ఇంజినీర్స్​ వంటి సంస్థలు.. దేశంలో రోడ్డు నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నాయి.