తెలుగు న్యూస్  /  Telangana  /  Centre Green Signal For Madnoor Bodhan National Highway Works

National Highway : మద్నూర్-బోధన్ జాతీయ రహదారి పనులకు గ్రీన్ సిగ్నల్..

HT Telugu Desk HT Telugu

24 March 2023, 8:03 IST

  • Madnoor Bodhan Highway : తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మద్నూర్-బోధన్ రహదారి విస్తరణకు ఆమోదం తెలిపింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (PTI)

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేలా మధ్నూర్-బోధన్ రహదారి(Madnoor Bodhan Highway) విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్టుగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(nitin gadkari) వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

కామారెడ్డి(Kamareddy), నిజామాబాద్, నాందేడ్‌లోని ఎన్‌హెచ్‌-161బీబీలోని మద్నూర్‌ నుంచి బోధన్‌ సెక్షన్‌ వరకు రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదం చెప్పారు. 39.032 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం పద్ధతిలో 2022-23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తారు.

దీనితో నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని బోధన్ నుంచి మద్నూర్ వరకు ఉన్న రెండు లైన్ల ప్రధాన రహదారి నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మారనుంది. ఇటీవల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూర్-బోధన్ జాతీయ రహదారి పనులు చేపట్టాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి పలుమార్లు కోరారు. దీనిపై ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారి పూర్తయితే.. రవాణా సౌకర్యం మెరగుపడుతుంది.

బోధన్, మద్నూర్ జాతీయ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.429 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పనులు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు విస్తరణకు భూ సేకరణ జరగాల్సి ఉంది.

ఎన్‌హెచ్‌-163జీ(Khammam-Vijayawada)లో రేమిడిచెర్ల గ్రామం నుంచి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్‌-16లో) వరకు నాలుగు లైన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సెక్షన్‌ అభివృద్ధి చేస్తున్నారు. 29.709 కిలోమీటర్ల లేఅవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్‌ కారిడార్‌ ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో నిర్మిస్తామని గడ్కరీ వెల్లడించారు.