Mumbai Goa highway : ఇక ముంబై టు గోవా ప్రయాణం.. కేవలం 5 గంటలే!
01 April 2023, 9:30 IST
- Mumbai to Goa National highway : ముంబై- గోవా ప్రయాణం ప్రస్తుతం 11 గంటలు. త్వరలోనే నేషనల్ హైవే 66 అందుబాటులోకి రానుంది. ఫలితంగా ప్రయాణం 5 గంటల కన్నా తక్కువగా ఉండనుంది!
ముంబై- గోవా నేషనల్ హైవే పనులు..
Mumbai Goa National highway : ముంబై- గోవాని కనెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న నేషనల్ హైవే 66 వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది. ఫలితంగా.. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 11 గంటల జర్నీ.. ఇక 5 గంటలకు తగ్గిపోనుంది! ఈ వివరాలను కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
2024 జనవరి నాటికి రెడీ..!
నేషనల్ హైవే 66 పనులను ఇటీవలే పరిశీలించారు నితిన్ గడ్కరీ. ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని హామీనిచ్చారు. 2024 జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. పూర్తైన తర్వాత.. ఈ జాతీయ రహదారి కారణంగా ముంబై- గోవా మధ్య దూరం 600కి.మీల మేర తగ్గుతుందని వివరించారు. ఫలితంగా 5 గంటల కన్నా తక్కువ సమయంలోనే ముంబై నుంచి గోవాకు ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.
Mumbai Goa highway status : ఈ ముంబై- గోవా నేషనల్ హైవే 66ని మొత్తం 10 దశల్లో నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు దశల్లో ఇంకా పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు టన్నెల్స్‌లో ప్రయాణం..
జాతీయ రాహదారి కషేడి ఘాట్ ప్రాంతంలో.. రెండు టన్నెల్స్ ఉండనున్నాయి. వీటిల్లో ఒక టన్నెల్‌ను వర్షాకాలం నాటికి ఓపెన్ చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండో టన్నెల్ పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవ్వనున్నాయి.
Mumbai Goa highway route : వాస్తవానికి.. ఈ హైవేలోని రెండు స్ట్రెచ్‌లను 12ఏళ్ల ముందే పూర్తి చేయాల్సి ఉంది! భూముల కొనుగోళ్లు, అనుమతులు, కాంట్రాక్ట్ పనుల వల్ల చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోయాయని నితిన్ గడ్కరీ అన్నారు.
Mumbai Goa highway news : ఈ ముంబై- గోవా నేషనల్ హైవే 66లో.. కోంకణ్ ప్రాంతంలోని మొత్తం 66 పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. ఫలితంగా రాష్ట్రాలకు రెవెన్యూ కూడా పెరిగి అవకాశం ఉంది.