తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

HT Telugu Desk HT Telugu

30 April 2024, 15:38 IST

google News
  • మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లలో తమ క్యాడర్ ను కోల్పోతున్న మావోలు.. మంగళవారం చత్తీస్ గఢ్ లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో ఏడుగురు సహచరులను కోల్పోయారు. బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మంది మావోయిస్టులు హతమయ్యారు.

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్
చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్

Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అభూజ్ మద్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ (Chhattisgarh encounter) లో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. టేక్మెట, కాకూర్ గ్రామాల మధ్య అడవిలో ఉదయం 6 గంటల సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పి తెలిపారు.

ఆయుధాల స్వాధీనం

చత్తీస్ గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో సీనియర్ మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం సోమవారం రాత్రి నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కు బయలుదేరింది. వారు కంకూరు గ్రామానికి చేరుకోగానే ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురుకాల్పులు (Chhattisgarh encounter) ముగిసిన తర్వాత ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కొనసాగుతున్న కూంబింగ్

గాలింపు చర్యలు చేపట్టామని, ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ తెలిపారు. బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మంది మావోయిస్టులు (encounter news) హతమయ్యారు. ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు.

తదుపరి వ్యాసం