తెలుగు న్యూస్  /  National International  /  Use Aadhaar Confidently, But Exercise Caution As In Case Of Bank Account, Pan: Govt

Use Aadhaar confidently, but exercise caution: ‘ఆధార్ ను జాగ్రత్తగా వాడండి’

HT Telugu Desk HT Telugu

30 December 2022, 22:41 IST

  • Aadhaar tips: ఆధార్ కార్డును వాడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వివిధ సర్వీసులు పొందడానికి ఆధార్ ను వినియోగించే విషయంలో అనుమానాలు వద్దు, కానీ, అప్రమత్తత అవసరమని హెచ్చరించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aadhaar tips: ఆధార్ కార్డును వినియోగించే విషయంలో అనుమానాలు అక్కర్లేదని కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడానికి ఆధార్ ఆథెంటికేషన్ అవసరమని, అలాంటి సమయాల్లో ఎలాంటి భయాలు లేకుండా, ఆధార్ ను వాడవచ్చని సూచించింది. మిగతా సమయాల్లో, బ్యాంక్ ఖాతాను, పాన్ కార్డును, పాస్ పోర్ట్ ను ఎంత జాగ్రత్తగా వినియోగిస్తామో, ఆధార్ ను కూడా అదే తరహాలో వినియోగించాలని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

Indians killed in US : అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి- చెట్టుకు ఇరుక్కున్న కారు!

Virtual Identifier VID: వర్చువల్ ఐడీ

ఆధార్ అనేది భారత పౌరుల డిజిటల్ ఐడీ అని, దాన్ని ఆన్ లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీ ఐడీ వెరిఫికేషన్ కోసం వాడవచ్చని పేర్కొంది. అయితే, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థలకే ఆధార్ వివరాలను ఇవ్వాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా, తమ ఆధార్ నెంబర్ ను షేర్ చేసుకోవాలని అనుకోనట్లయితే, వారు వర్చువల్ ఐడీని పొందవచ్చని సూచించారు. వర్చువల్ ఐడీ(Virtual Identifier (VID)) ని UIDAI వెబ్ సైట్ ద్వారా కానీ, మైఆధార్(myaadhaar) పోర్టల్ ద్వారా కానీ పొందవచ్చని వివరించింది. ఆ వీఐడీని ఒక రోజు తరువాత మార్చుకోవచ్చని వివరించింది.

Aadhaar locking: ఆధార్ లాకింగ్

ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ(UIDAI) ఆధార్ లాకింగ్(Aadhaar locking), బయోమెట్రిక్ లాకింగ్(biometric locking) సదుపాయాలను కూడా ప్రారంభించిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. నిర్ధారిత సమయం వరకు ఆధార్ ను వినియోగించబోనని భావిస్తే, ఆధార్ లాక్ చేసుకోవచ్చని వివరించింది. ఆ తరువాత, అవసరం ఉందని భావించినప్పుడు, వెంటనే అన్ లాక్ చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా, పౌరులు గత ఆరు నెలల్లో ఆధార్ ను ఎప్పుడు, ఎక్కడ వినియోగించారో UIDAI website లేదా m-Aadhaar app ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. అలాగే, ప్రతీ ఆధార ఆథెంటిఫికేషన్ గురించి ఈ మెయిల్ ద్వారా UIDAI సమాచారం ఇస్తుందని తెలిపింది. ఆధార్ దుర్వినియోగం అయిందని భావిస్తే, పౌరులు 1947 కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.