తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indians Killed In Us : అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి- చెట్టుకు ఇరుక్కున్న కారు!

Indians killed in US : అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి- చెట్టుకు ఇరుక్కున్న కారు!

Sharath Chitturi HT Telugu

27 April 2024, 13:04 IST

    • Indians Killed in America accident : అమెరికాలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. గాల్లోకి ఎగిరి, ఒక చెట్టులో ఇరుక్కుపోయింది! మితిమీరిన వేగమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
అమెరికాలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి!
అమెరికాలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి!

అమెరికాలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి!

US road accident : అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సౌత్​ కరోలీనాలోని గ్రీన్​విల్లె కౌంట్​లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

ప్రమాదం ఎలా జరిగింది..?

అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్​ పటేల్​, సంగీతాబెన్​ పటేల్​, మనీషాబెన్​ పటేల్​. వీరందరు గుజరాత్​కు చెందినవారు. మహిళలు ప్రయాణిస్తున్న ఎస్​యూవీ.. వంతెనపైకి దూసుకువెళ్లింది. అనంతరం ఒక ఎత్తైన వస్తువు మీద నుంచి గాల్లోకి 20 అడుగుల పైకి ఎగిరింది. చివరికి.. వంతెన అపోజిట్​ వైపు ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడిపోయింది. కారు మితిమీరిన వేగం మీద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో వేరే వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు.

మహిళలు ప్రయాణించిన కారు.. చెట్టులో ఇరుక్కుపోయిన స్థితిలో కనిపించింది. చాలా భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీని బట్టి.. కారు ఎంత వేగంగా వెళ్లిందో, చెట్టును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:- Malaysia: ఆకాశంలో రెండు హెలీకాప్టర్లు ఢీ; 10 మంది దుర్మరణం

Indians killed in America road accident : "అంతవేగంగా వాహనాలు వెళ్లడం చాలా అరుదు. 4-6 లేన్ల ట్రాఫిక్​ని జంప్​ చేసి, చివరికి.. 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు మీదకు వెళ్లిందంటే.. స్పీడ్​ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు," అని ఓ అధికారి చెప్పారు.

కారులో ఒక డిటెక్షన్​ సిస్టెమ్​ ఉంది. కారు ప్రమాదానికి గురైన తర్వాత.. ఆ సిస్టెమ్​ ద్వారా.. సంబంధిత మహిళల కుటుంబసభ్యులకు మెసేజ్​ వెళ్లింది. వారు.. సౌత్​ కరోలీనా అధికారులను అలర్ట్​ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. ఎమర్జెన్సీ రెస్పాన్సీ టీమ్​, సౌత్​ కరోలీనా హైవే పాట్రోల్​, ఫైర్​ అండ్​ రెస్క్యూ టీమ్​, ఈఎంఎస్​ యూనిట్స్​.. ఘటనా స్థలానికి పరుగులు తీశాయి.

Indians killed in South Carolina road accident : అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్​యూవీలో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మరణించగా.. నాలుగో మనిషిని అధికారులు రక్షించి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నాలుగో వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.