తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian-americans In Race For Us Congress: ప్రతినిధుల సభ రేసులో ఇండో అమెరికన్స్

Indian-Americans in race for US Congress: ప్రతినిధుల సభ రేసులో ఇండో అమెరికన్స్

HT Telugu Desk HT Telugu

05 November 2022, 22:37 IST

  • Indian-Americans in race for US Congress: అమెరికాలో నవంబర్ 8న జరగనున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఐదుగురు భారతీయ సంతతికి చెందిన నేతలున్నారు. వారు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం కోసం పోటీ పడుతున్నారు. 

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి
అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (AFP)

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి

Indian-Americans in race for US Congress: ప్రపంచ దేశాల పార్లమెంటరీ వ్యవస్థల్లోకి భారతీయ అమెరికన్లు చొచ్చుకుపోతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్, బ్రిటన్ పీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ కూడా భారతీయ సంతతి వారే. వీరు కాకుండా, పార్లమెంటు సభ్యులుగా పలు దేశాల్లో భారతీయ సంతతి వారు సేవలందిస్తున్నారు.

Indian-Americans in race for US Congress: మిడ్ టర్మ్ పోల్స్

అమెరికా ప్రతినిధుల సభకు నవంబర్ 8న మిడ్ టర్మ్ పోల్స్ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు పోటీలో ఉన్నారు. వారు అమి బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీల జయపాల్, శ్రీ తనేదార్. వీరిలో మొదటి నలుగురు ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభ(House of Representatives)లో సభ్యులుగా ఉన్నారు. రీ ఎలక్షన్ కోసం వారు బరిలో ఉన్నారు. ఐదో వ్యక్తి అయిన శ్రీ తనేదార్ మిషిగన్ నుంచి పోటీ చేస్తున్నారు.

Indian-Americans in race for US Congress: నలుగురు పక్కా..

పోల్ స్టర్ల అంచనాలు, ఒపీనియన్ పోల్స్ లెక్కల ప్రకారం Ami Bera, Raja Krishnamoorthi, Ro Khanna, Pramila Jayapal మళ్లీ విజయం సాధించడం దాదాపు ఖాయమే. డెమొక్రటిక పార్టీ తరఫున పోటీ చేస్తున్న వీరు మళ్లీ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. Michigan 13th Congressional District నుంచి పోటీ చేస్తున్న బిజినెస్ మ్యాన్ Shri Thanedar విజయంపై మాత్రం కాస్త అనుమానాలున్నాయి.

Indian-Americans in race for US Congress: ఆరో సారి..

7th Congressional District of California నుంచి బరిలో ఉన్న అమీ బెరా వరుసగా ఆరో సారి ఈ పోటీలో ఉన్నారు. మిగతా ముగ్గురు వరుసగా నాలుగో సారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు గత మూడు ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

తదుపరి వ్యాసం