PAN, Aadhar linking: పాన్, ఆధార్ లింక్ పై తాజా అప్ డేట్-pan not linked with aadhaar by end of march 2023 to be rendered inoperative i t dept
Telugu News  /  Business  /  Pan Not Linked With Aadhaar By End Of March 2023 To Be Rendered Inoperative: I-t Dept
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

PAN, Aadhar linking: పాన్, ఆధార్ లింక్ పై తాజా అప్ డేట్

24 December 2022, 18:55 ISTHT Telugu Desk
24 December 2022, 18:55 IST

PAN, Aadhar linking: పాన్(permanent account numbers PAN) కార్డు ఉన్నవారంతా తమ పాన్ ను ఆధార్(Aadhaar) తో అనుసంధానం చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మారోసారి, ఆ విషయంపై ఆదాయ పన్ను విభాగం స్పష్టతనిచ్చింది.

ముందే హెచ్చరించిన విధంగా, 2023 మార్చి 31 లోగా ఆధార్(Aadhaar), పాన్ (permanent account numbers PAN) ల అనుసంధానం ముగించాలని ఆదాయ పన్ను శాఖ శనివారం మరోసారి గుర్తు చేసింది.

PAN, Aadhar linking: పాన్ పని చేయదు..

ఒకవేళ 2023 మార్చి 31 లోగా ఆధార్(Aadhaar), పాన్ (permanent account numbers PAN) ల అనుసంధానం చేయని పక్షంలో 2023, ఏప్రిల్ 1 వ తేదీ నుంచి పాన్(permanent account numbers PAN) పని చేయదని ఆదాయ పన్ను విభాగం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘పాన్, ఆధార్(Aadhaar) అనుసంధానం తప్పని సరి.. అత్యవసరం.. ఆలస్యం చేయకండి’’ అని స్పష్టం చేసింది. ‘మినహాయింపు పొందిన వర్గాలను మినహాయిస్తే.. మిగతా వారంతా తమ పాన్ తో(permanent account numbers PAN) ఆధార్(Aadhaar) నెంబర్ ను అనుసంధానించడం తప్పని సరి. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం కచ్చితంగా పాన్(permanent account numbers PAN) తో ఆధార్(Aadhaar) అనుసంధానపర్చాలి. అలా లింక్ చేయని పాన్(permanent account numbers PAN) లన్నీ 2023 ఏప్రిల్ 1 నుంచి చెల్లవు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. పాన్(permanent account numbers PAN) చెల్లకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

PAN, Aadhar linking: వీరికి మాత్రం మినహాయింపు..

2017 మే కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అస్సాం, మేఘాలయ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల పౌరులకు; ఐటీ చట్టం,1961 ప్రకారం నాన్ రెసిడెంట్స్ కు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, భారతీయ పౌరులు కాని వారికి ఈ పాన్(permanent account numbers PAN), ఆధార్(Aadhaar) అనుసంధాన నిబంధన నుంచి మినహాయింపు ఉంది. పాన్(permanent account numbers PAN), ఆధార్ అనుసంధానం చేయని వారు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయలేరు. పెండింగ్ రీఫండ్స్ రావు. పన్ను రాయితీలు లభించవు. దాంతో, అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది.