How to link PAN with Aadhaar: వెంటనే ఇలా చేయండి, లేదంటే మీ పాన్ కార్డ్ చెల్లదు
How to link PAN with Aadhaar:ఇప్పటివరకు ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం చేయనివారు వెంటనే ఆ పని చేయాల్సి ఉంటుంది. లేదంటే, వారి పాన్ కార్డ్ చెల్లకుండా పోతుంది.
last date to link PAN with Aadhaar: ఆధార్ కార్డు, పాన్ కార్డులను తప్పని సరిగా లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకు విధించిన గడువు తేదీలను కూడా పలుమార్లు పొడగించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆధార్, పాన్ కార్డుల అనుసంధానానికి చివరి తేదీ మార్చి 31, 2023.
Invalid PAN Card: పాన్ కార్డు ఇన్ వాలిడ్ అవుతుంది
మార్చి 31, 2023లోపు పాన్, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోనట్లయితే, మీ పాన్ కార్డ్ చెల్లకుండా పోతుంది. అంటే, ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులు ఏప్రిల్ 1, 2024 నుంచి చెల్లవు. అందువల్ల, ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలనుకుంటే వెంటనే ఆధార్, పాన్ లను అనుసంధానం చేయండి. పాన్, ఆధార్ ల అనుసంధానికి మార్చి 31, 2023 చివరి గడువు అని ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
₹1000 fine to link PAN with Aadhar: రూ. 1000 ఫైన్
నిజానికి ఆధార్, పాన్ గడువు మార్చ్ 31, 2022 కే ముగిసింది. అయితే, రూ. 500 ల అపరాధ రుసుముతో జూన్ 30, 2022 వరకు గడువు పొడగించింది. ఇప్పుడు, రూ. 1000 అపరాధ రుసుముతో మార్చి 31, 2023 వరకు ఆధార్, పాన్ లను అనుసంధానం చేయవచ్చు. అంటే, ఇప్పుడు ఆధార్, పాన్ లను లింక్ చేయాలనుకునే వారు రూ. 1000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ లింక్ అయినట్లుగా నిర్ధారణ అయితేనే, ఆదాయ పన్ను రిటర్న్స్ ను ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ప్రాసెస్ చేస్తుందన్న విషయం గుర్తుంచుకోండి.
How to link PAN with Aadhaar: ఆధార్, పాన్ అనుసంధానం ఎలా?
ముందుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్ ను మీ దగ్గర పెట్టుకోండి. ఆ తరువాత..
- “https://www.incometax.gov.in/iec/foportal/” వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- అక్కడ ఉన్న ‘Quick Links సెక్షన్ లోని లింక్ ఆధార్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- మీ పాన్ నెంబర్ ను, ఆధార్ నెంబర్ ను సంబంధిత బాక్స్ ల్లో ఎంటర్ చేసి, వాలిడేట్ బటన్ ను క్లిక్ చేయండి.
- ఒకవేళ ఇప్పటికే మీ ఆధార్, పాన్ లింక్ అయి ఉంటే, అదే విషయం స్కీన్ పై కనిపిస్తుంది.
- ఒకవేళ ఆధార్, పాన్ లింక్ కానట్లయితే, ఎన్ ఎస్ డీ ఎల్ పోర్టల్ లో మీరు ఇప్పటికే రూ. 1000 కి చలాన్ చెల్లించి, ఉంటే, ఆ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. అనంతరం కొన్ని వివరాలు కోరుతూ ఒక పాప్ అప్ స్క్రీన్ వస్తుంది.
- ఆ డిటైల్స్ ను ఎంటర్ చేసి, లింక్ ఆధార్ ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
- మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. దాంతో, ఆధార్, పాన్ లింకింగ్ ప్రాసెస్ ముగుస్తుంది.
- NSDL పోర్టల్ లో రూ. 1000 చెల్లించిన తరువాత, 4 లేదా 5 రోజుల తరువాతనే ఈ ఆధార్, పాన్ లింకింగ్ ప్రాసెస్ ను ప్రారంభించండి.