ChatGPT Aadhaar card: కృత్రిమ మేథతో మరో ముప్పు తెరపైకి వచ్చింది. ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీతో నకిలీ ఆధార్, నకిలీ పాన్ కార్డులను సృష్టిస్తున్నారు. ఈ నకిలీ కార్డులు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.