Aadhaar updates: ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి..-uidai want aadhaar holders to update documents submitted nearly 10 years ago ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Updates: ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి..

Aadhaar updates: ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి..

HT Telugu Desk HT Telugu
Dec 24, 2022 10:27 PM IST

Aadhaar updates: ఆధార్ కార్డ్ కు సంబంధించి యూఐడీఏఐ (Unique Identification Authority of India - UIDAI) కీలక ప్రకటన జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Aadhaar updates: దేశ పౌరులందరికీ 10 అంకెల ప్రత్యేక సంఖ్యను ఆపాదిస్తూ ఆధార్ పేరుతో ఒక గుర్తింపు పత్రాన్ని కేంద్రం జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆధార్ కార్డు దాదాపు అన్ని గుర్తింపు అవసరాలకు తప్పని సరిగా మారింది. అంతేకాదు, ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేయడం కూడా తప్పని సరి చేశారు.

Aadhaar updates: పదేళ్ల క్రితం తీసుకున్నారా?

అయితే, మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డును తీసుకుని పదేళ్లు దాటి ఉంటే మీ కోసం ఆధార్ ను జారీ చేసే సంస్థ యూఐడీఏఐ (Unique Identification Authority of India - UIDAI) ఒక కీలక సూచన చేసింది. ఆధార్ పొందినప్పటి నుంచి.. ఇప్పటివరకు మీరు మీ వివరాలను ఆధార్ డేటాబేస్ లో అప్ డేట్ చేసి ఉండనట్లయితే, వెంటనే మీ వివరాలను ఆన్ లైన్ ద్వారా కానీ, ఆఫ్ లైన్ ద్వారా కానీ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. అంటే, మీ గుర్తింపు వివరాలు మారినా, మీ చిరునామా మారినా, మీ మొబైల్ నెంబర్ మారినా, మరే ఇతర వివరాలను మారినా, మారిన ఆ వివరాలకు సంబంధిత డాక్యుమెంట్లతో ఆధార్ వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.

Aadhaar updates: ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ఆధార్ లో మార్పులను మీరు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి పెట్టుకుని, యూఐడీఏఐ (Unique Identification Authority of India - UIDAI) అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో ఈ మార్పులను అప్ డేట్ చేసుకోవచ్చు. లేదా, మీ సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి ఆఫ్ లైన్ లో మీ ఆధార్ వివరాలను మార్చుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మార్పులు చేసుకునేందుకు వెళ్లే సమయంలో, సంబంధిత డాక్యుమెంట్లను వెంట తీసుకువెళ్లడం మర్చిపోవద్దు. ఏయే మార్పులకు ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలిపే వివరాలు UIDAI వెబ్ సైట్లో ఉంటాయి. 319 కేంద్ర ప్రభుత్వ పథకాలు సహా దాదాపు 1100 ప్రభుత్వ పథకాలకు ఆధారే ఆధారం. వీటికి ఆధార్ సహాయం తోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.

Whats_app_banner