తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net Admit Card 2022: యూజీసీ నెట్ ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ రెడీ

UGC NET Admit Card 2022: యూజీసీ నెట్ ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ రెడీ

HT Telugu Desk HT Telugu

25 February 2023, 15:06 IST

  • UGC NET Admit Card 2022: యూజీసీ నెట్ ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.nic.in/ . నుంచి అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC NET Admit Card 2022: యూజీసీ నెట్ (UGC NET) ఫేజ్ 2 (phase 2) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను ఎన్టీఏ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.nic.in/ . నుంచి అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 1 (UGC NET December 2022 phase 1) పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 57 సబ్జెక్టులకు ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ఫేజ్ 1 పరీక్షలు ముగిసాయి.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

UGC NET Admit Card 2022: ఐదు సబ్జెక్టులకు ఫేజ్ 2

ఫేజ్ 2 (UGC NET December 2022 phase 2) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను ఇప్పడు ఎన్టీఏ విడుదల చేసింది. మొత్తం 5 సబ్జెక్టులకు ఫేజ్ 2 లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. 2023 ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2 తేదీల్లో ఈ ఫేజ్ 2 పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష (UGC NET December 2022 phase 2) ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డు (admit card) లను విద్యార్థులు https://ugcnet.nta.nic.in/ . వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ లోని నియమ నిబంధనలను విద్యార్థులు క్షుణ్నంగా చదవడం మంచిది. అలాగే, తరచు అధికారిక వెబ్ సైట్స్ www.nta.ac.in, https://ugcnet.nta.nic.in లను సందర్శించడం సముచితం.

How to down load UGC NET Admit Card 2022: అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

  • యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 2 (UGC NET December 2022 phase 2) అడ్మిట్ కార్డ్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం..
  • అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.nic.in/ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజ్ పై ఉన్న admit card download లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ తదితర వివరాలను ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
  • హాల్ టికెట్ స్కీన్ పై కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని భద్ర పర్చుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • అడ్మిట్ కార్డ్ (UGC NET December 2022 phase 2 admit card) ను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, 011-40759000 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా, ugcnet@nta.ac.in కు ఈమెయిల్ చేయవచ్చు.

టాపిక్