UGC NET Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్ జారీ ప్రారంభం; డౌన్ లోడ్ ఇలా..-ugc net admit card 2023 released where how to check december exam hall tickets ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్ జారీ ప్రారంభం; డౌన్ లోడ్ ఇలా..

UGC NET Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్స్ జారీ ప్రారంభం; డౌన్ లోడ్ ఇలా..

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 10:14 PM IST

UGC NET Admit Card: యూజీసీ నెట్ (UGC NET 2023) అడ్మిట్ కార్డ్స్ జారీ ప్రారంభమైంది. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/iStockphoto)

UGC NET Admit Card: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA)) యూజీసీ నెట్ (UGC NET) అడ్మిట్ కార్డ్స్ ను జారీ చేయడం ప్రారంభించింది. ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in. నుంచి ఈ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ను ఎన్టీఏ (NTA) వెబ్ సైట్ ugcnet.nta.nic.in. లో అప్ లోడ్ చేసింది.

UGC NET Admit Card: ఫిబ్రవరి 21 నుంచి..

అభ్యర్థులు తమ పుట్టిన రోజు, అప్లికేషన్ నెంబర్ లను ఎంటర్ చేయడం ద్వారా తమ UGC NET అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ 2022 పరీక్షలు (UGC NET December 2022 exam) ఫిబ్రవరి 21, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు జరుగుతాయి. UGC NET అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులు, నోటిఫికేషన్ లోని నియమ నిబంధనలను మరోసారి క్షుణ్నంగా చదువుకోవడం మంచిది.

UGC NET Admit Card: అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా..

  • యూజీసీ నెట్ (UGC NET) అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • క్యాండిడేట్స్ యాక్టివిటీ ట్యాబ్ లో డౌన్ లోడ్ అడ్మిట్ కార్డ్ (download admit card) లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్ పై మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • వివరాలు చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఒక సాఫ్ట్ కాపీని భద్ర పర్చుకోవాలి. అలాగే, అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.
  • యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష 3 గంటల పాటు జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 ల మధ్య ఎలాంటి బ్రేక్ ఉండదు. ఫస్ట్ షిప్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ షిప్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరరకు ఉంటుంది.

Direct link to download admit card 

IPL_Entry_Point

టాపిక్