UGC NET December Exam 2022: యూజీసీ నెట్ పై ముఖ్యమైన అప్ డేట్-ugc net december exam 2022 exam city intimation link soon at ugcnetntanicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net December Exam 2022: యూజీసీ నెట్ పై ముఖ్యమైన అప్ డేట్

UGC NET December Exam 2022: యూజీసీ నెట్ పై ముఖ్యమైన అప్ డేట్

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 03:10 PM IST

UGC NET December Exam 2022: UGC NET December Exam 2022: యూజీసీ నెట్ పరీక్షపై ఎన్టీఏ (National Testing Agency, NTA) కీలక అప్ డేట్ ను విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Hindustan Times)

UGC NET December Exam 2022: యూజీసీ నెట్ (UGC NET) పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఎన్టీఏ (National Testing Agency, NTA) శుక్రవారం ప్రకటించింది. యూజీసీ నెట్ (UGC NET) కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in లో ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ వివరాలను చెక్ చేసుకోవాలని కోరింది.

UGC NET December Exam 2022: ఫిబ్రవరి మొదటి వారంలో..

యూజీసీ నెట్ డిసెంబర్ 2022 పరీక్ష (UGC NET December Exam 2022) కు సంబంధించి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ వివరాలను ఫిబ్రవరి మొదటి వారంలో యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in లో అప్ లోడ్ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ లింక్ ugcnet.nta.nic.in హోం పేజీపై కనిపిస్తుందని పేర్కొంది. యూజీసీ నెట్ (UGC NET) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ (admit cards) ఫిబ్రవరి తొలి వారంలో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తాయి. యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష సబ్జెక్టుల వారీగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు రెండు షిఫ్ట్ ల్లో జరుగుతుంది. ఒక షిప్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఎలాంటి బ్రేక్ లేకుండా రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

UGC NET December Exam 2022: ఇలా చెక్ చేసుకోండి..

  • యూజీసీ నెట్ (UGC NET) అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ను సందర్శించండి.
  • హోం పేజ్ పై కనిపించే Exam city intimation లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ వివరాలు నింపి సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి.
  • మీ ఎగ్జామ్ సిటీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కూడా తీసి పెట్టుకోవాలి.

IPL_Entry_Point

టాపిక్