తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ranveer Singh Investment : ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన రణ్​వీర్​ సింగ్​!

Ranveer Singh investment : ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన రణ్​వీర్​ సింగ్​!

Sharath Chitturi HT Telugu

03 September 2022, 13:45 IST

    • Ranveer Singh investment : రణ్​వీర్​ సింగ్​.. తాజాగా ఓ బ్యూటీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆ కంపెనీ ఏంటంటే..
రణ్​వీర్​ సింగ్​
రణ్​వీర్​ సింగ్​ (AP/file)

రణ్​వీర్​ సింగ్​

Ranveer Singh investment : ప్రముఖ క్రికెటర్లు, నటులు.. వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్న వార్తలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. బాలీవుడ్​ ప్రముఖ నటుడు రణ్​వీర్​ సింగ్​.. షుగర్​ కాస్మొటిక్స్​ అనే బ్యూటీ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ షుగర్​ కాస్మొటిక్స్​ సంస్థ.. ఇటీవలి కాలంలో ఇప్పటికే 50మిలియన్​ డాలర్ల నిధులను సమీకరించుకోవడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఈ షుగర్​ కాస్మొటిక్స్​ సంస్థకు ఎల్​ కార్టర్​టన్​ నేతృత్వం వహిస్తోంది. ఏ91 పార్ట్​నర్స్​, ఎలివేషన్​ క్యాపిటల్​, ఇండియా కోషియంట్​లు పెట్టుబడిదారులుగా ఉన్నాయి.

రణ్​వీర్​ సింగ్​ పెట్టుబడుల గురించి షుగర్​ కాస్మొటిక్స్​ సంస్థ అధికారి ప్రకటన జారీ చేసింది. తమ బ్రాండ్​ అభివృద్ధికి రణ్​వీర్​ సింగ్​ కృషి చేస్తారని స్పష్టం చేసింది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

Sugar cosmetics : "రణ్​వీర్​ సింగ్​ పెట్టుబడులతో మాకు చాలా సంతోషంగా ఉంది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మేము ప్రయత్నిస్తున్న సమయంలో రణ్​వీర్​ మాతో చేరారు. దేశంలో ఆయనొక యూత్​ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు​. ఆయన మా బ్రాండ్​కు సరిగ్గా నప్పుతారు. రణ్​వీర్​ సింగ్​తో మా బ్రాండ్​, సంస్థ అభివృద్ధి పెరుగుతుందని భావిస్తున్నాము," అని షుగర్​ కాస్మొటిక్స్​ కో ఫౌండర్​, సీఓఓ కౌషిక్​ ముఖర్జీ వెల్లడించారు.

షుగర్​ కాస్మొటిక్స్​కు దేశవ్యాప్తంగా 550 నగరాల్లో 45వేలకుపైగా రీటైల్​ పాయింట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక సేల్స్​ రూ. 550కోట్లుకుపైనే ఉంటుంది.

లిప్​ కలర్స్​, ఐ మేకప్​తో పాటు వివిధ బ్యూటీ ప్రాడక్టులను అటు ఆన్​లైన్​లో, ఇటు ఆఫ్​లైన్​లో విక్రయిస్తుంది ఈ షుగర్​ కాస్మొటిక్స్​.