Tax saving investments | విభిన్న టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఇవిగో
28 February 2022, 15:32 IST
- Tax saving investments | టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో దాదాపు అన్నీ రిస్క్ లేనివి, తక్కువ రిస్క్ కలిగినవే. వేతన జీవులు ఆర్థిక సంవత్సరం చివరలో టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరే ముందు ఏ స్కీమ్ ఎలాంటి రాబడి ఇస్తుందో ఒకసారి చూడండి.
టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి తెలుసా?
ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపులు పొందేందుకు వివిధ సెక్షన్ల కింద పన్ను రాయితీ కోరవచ్చు. ఇలా పన్ను రాయితీ కోరేందుకు ఉపకరించే టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ విభిన్న కాలపరిమితులకు లోబడి ఉన్నాయి. దాదాపు అన్ని టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌కు లాకిన్ పరిమితి ఉంటుంది. ఆయా వివరాలు పట్టిక రూపంలో చూద్దాం.
దాదాపు అన్ని సేవింగ్స్ స్కీముల లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉండగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ వరకు, సుకన్య సమృద్ధి యోజన పాపకు వివాహం అయ్యేవరకు లేదా ఖాతా తెరిచి 21 ఏళ్లు అయ్యే వరకు లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ విషయంలో కూడా లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. అతి తక్కువ లాకిన్ పీరియడ్ కలిగిన పొదుపు సాధనం ఈఎల్ఎస్ఎస్. ఇది స్టాక్ మార్కెట్ ఫలితాలకు లోబడి ఉంటుంది. ఇందులో పెట్టిన ప్రతి పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తవ్వాల్సి ఉంటుంది.
టాక్స్ సేవింగ్ స్కీమ్స్ పట్టిక
80 సీ సెక్షన్ పొదుపునకు ప్రత్యామ్నాయాలు ఇవీ..
పై పట్టికలో చూపిన అనేక పొదుపు సాధనాలు సెక్షన్ 80 సీ పరిధిలోకి వస్తాయి. అయితే సెక్షన్ 80 సీ కింద కేవలం రూ. 1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపు కోరవచ్చు. ఒకవేళ మీ పిల్లలు చదువుకునే వయసులో ఉంటే వారికి వెచ్చించే ట్యూషన్ ఫీజులు కూడా సెక్షన్ 80 సీ పరిధిలో మినహాయింపు కోరవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే వాటికి చెల్లించే ప్రీమియం కూడా ఈ సెక్షన్ పరిధిలో మినహాయింపు కోరవచ్చు. అలాగే ప్రావిడెంట్ ఫండ్ చందాకు కూడా ఈ సెక్షన్ పరిధిలోనే మినహాయింపు లభిస్తుంది.
టాపిక్