తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Queen Elizabeth's Health News | క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యం విషమం

Queen Elizabeth's health news | క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యం విషమం

08 September 2022, 20:33 IST

  • Queen Elizabeth's health news | బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమె వయస్సు 96 ఏళ్లు. దాదాపు సంవత్సర కాలంగా ఆమె పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

క్వీన్ ఎలిజబెత్ (ఫైల్ ఫొటో)
క్వీన్ ఎలిజబెత్ (ఫైల్ ఫొటో) (REUTERS)

క్వీన్ ఎలిజబెత్ (ఫైల్ ఫొటో)

Queen Elizabeth's health news | బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం డాక్టర్లు ఆందోళన వెలిబుచ్చారు. దాంతో, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Queen Elizabeth's health news | వైద్యుల పర్యవేక్షణలో..

క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చాన్నాళ్లుగా ఆమె నిల్చోవడం, నడవడం తదితర విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని "episodic mobility problems" గా పేర్కొంటారు. దాదాపు గత సంవత్సరం అక్టోబర్ నుంచి క్వీన్ ఎలిజెబెత్ ఈ సమస్యలతో బాధ పడుతున్నారు.

Queen Elizabeth's health news | కుటుంబ సభ్యులకు సమాచారం..

క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్కాట్ లాండ్ లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. కొడుకు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కేమిల్లా, ప్రిన్స్ విలియమ్, అన్నీ, ఆండ్రూ, ఎడ్వర్డ్ తదితరులు క్వీన్ ఎలిజబెత్ వద్దనే ఉన్నారు. త్వరలో ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నారని, త్వరలో వారు కూడా స్కాట్ లాండ్ కు వెళ్తారని బ్రిటన్ రాజకుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Queen Elizabeth's health news | అరుదుగా కలుస్తారు..

ఇలా రాజ కుటుంబ సభ్యులంతా ఒకే సారి, ఒకే దగ్గర కలవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. క్రిస్ట్మస్, ఈస్టర్ తదితర పర్వదినాల్లో వారు ఇలా కలుస్తుంటారు. ఇప్పుడు మహారాణి క్వీన్ ఎలిజబెత్ అనారోగ్యం కారణంగా ఒకే దగ్గర చేరారు. బీబీసీ కూడా ఇతర కార్యక్రమాలను రద్దు చేసి, క్వీన్ ఆరోగ్య సమాచారాన్ని అందిస్తోంది.

Queen Elizabeth's health news | మహారాణిగా రికార్డ్ బ్రేక్

క్వీన్ ఎలిజబెత్ 1952 నుంచి బ్రిటన్ సహా పలు ఇతర కామన్వెల్త్ దేశాలకు మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ఆయా దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మొదలైన దేశాలున్నాయి. ఈ సంవత్సరం జూన్లో క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా 70 సంవత్సరాలు కొనసాగిన సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. కింగ్ జార్జ్ 6 మరణం అనంతరం ఆమె మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. అప్పడు ఆమె వయస్సు 25 ఏళ్లు మాత్రమే.