తెలుగు న్యూస్  /  National International  /  Pulwama Terror Attack Today, Cop Killed, Crpf Personnel Injured

Pulwama terror attack : ఉగ్రదాడిలో పోలీసు మృతి, జవానుకు తీవ్ర గాయాలు

Sharath Chitturi HT Telugu

02 October 2022, 16:13 IST

  • Pulwama terror attack : పుల్వామాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఓ పోలీసు వీరమరణం పొందారు. మరో జవానుకు గాయాలయ్యాయి.

ఉగ్రదాడిలో పోలీసు మృతి, జవానుకు తీవ్ర గాయాలు
ఉగ్రదాడిలో పోలీసు మృతి, జవానుకు తీవ్ర గాయాలు (file photo)

ఉగ్రదాడిలో పోలీసు మృతి, జవానుకు తీవ్ర గాయాలు

Pulwama terror attack today : జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు మరణించారు. మరో సీఆర్​పీఎఫ్​(సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​) జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

"సీఆర్​పీఎఫ్​, పోలీసుల బృందంపై పుల్వామా పింగ్లానా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక పోలీసు వీరమరణం పొందారు. మరో సీఆర్​పీఎఫ్​ జవానుకు గాయాలయ్యాయి," అని కశ్మీర్​ జోన్​ పోలీసులు ట్వీట్​ చేశారు.

ఘటనపై వేగంగా స్పందించామని, ఘటనాస్థలానికి అదనపు సిబ్బందిని తరలించామని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలానికి చుట్టుపక్కన ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలను ముమ్మరం చేశామని స్పష్టం చేశారు.

ఆ ఎన్​కౌంటర్​ జరిగిన కొన్ని గంటల తర్వాత…!

Shopian encounter today : షోపియాన్​లో ఎన్​కౌంటర్​ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పుల్వామాలో ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఆ ఎన్​కౌంటర్​లో.. మూడు గంటల ఆపరేషన్​ అనంతరం ఓ లష్కర్​ ఉగ్రవాదిని జవాన్లు మట్టుబెట్టారు.

అమిత్​ షా జమ్ముకశ్మీర్​ పర్యటన వేళ..

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం జమ్ముకశ్మీర్​కు వెళ్లనున్నారు. ఆ ప్రాంతంలోని ప్రస్తుత భద్రతాపరమైన పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు.. రాజౌరీ, బారాముల్లా జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ర్యాలీలు పాల్గొననున్నారు అమిత్​ షా.

Amit Shah Jammu Kashmir visit : అమిత్​ షా పర్యటనకు ఒక్క రోజు.. రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఆందోళన చెలరేగడం సర్వత్రా చర్చకు దారితీసింది.