తెలుగు న్యూస్  /  Video Gallery  /  Three Local Let Terrorists Killed In Encounter In J&k's Shopian: Police

Kashmir Encounter- ఉగ్ర‌వాదుల‌ ఎన్‌కౌంట‌ర్‌

30 August 2022, 22:08 IST

  • Kashmir Encounter- జ‌మ్మూక‌శ్మీర్‌లోని షోపియాన్‌లో మంగ‌ళ‌వారం ఒక ఎన్‌కౌంట‌ర్ చోటు చేసుకుంది. ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్నార‌న్న స‌మాచారంతో ఒక ఇంటిని చుట్టుముట్టిన భ‌ద్ర‌తాద‌ళాల‌పైకి ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. భ‌ద్ర‌త ద‌ళాల ఎదురుకాల్పుల్లో ఆ ముగ్గురు టెర్ర‌రిస్ట్‌లు హ‌త‌మ‌య్యారు. వారు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌సంస్థ‌కు చెందిన టెర్ర‌రిస్ట్‌లుగా పోలీసులు గుర్తించారు. వారు స్థానిక క‌శ్మీరీలేన‌ని, స్థానికంగా జ‌రిగిన కొన్ని ఉగ్ర‌దాడుల‌కు వీరే బాధ్యుల‌ని ప్ర‌క‌టించారు. అలాగే, స్థానిక యువ‌త‌ను ఉగ్ర సంస్థ‌ల్లో చేర్చేవార‌ని పోలీసులు వివ‌రించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో పోలీసుల‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఈ వీడియోలో ఆ ఎన్‌కౌంట‌ర్ వివ‌రాలు చూడండి..